PM Kisan: అలర్ట్.. అక్టోబర్ 15లోపు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే.. లేదంటే రూ.2వేలు నష్టపోతారంతే..!

PM Kisan Samman Nidhi: దేశంలోని కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ. 2000 ఆర్థిక సహాయం అందజేస్తోంది. అయితే 15వ విడత ప్రయోజనాలను పొందాలంటే, రైతులు 3 పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి.

Update: 2023-10-08 13:30 GMT

PM Kisan: అలర్ట్.. అక్టోబర్ 15లోపు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే.. లేదంటే రూ.2వేలు నష్టపోతారంతే..!

PM Kisan 15th Installment: పీఎం కిసాన్ పథకం నుంచి ప్రయోజనం పొందుతున్నారా.. అయితే, మీ కోసం ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఉంది. దేశంలోని కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.2000 ఆర్థిక సాయం అందజేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే 15వ విడత లబ్ధి పొందాలంటే రైతులు 3 పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు అధికారులు. ఈ పనులను పూర్తి చేయడానికి చివరి తేదీ 15 అక్టోబర్ 2023గా నిర్ణయించారు.

అక్టోబరు 15 వరకు మూడు పనులు పూర్తి చేసిన లబ్ధిదారులకు మాత్రమే పీఎం కిసాన్ 15వ విడత మొత్తాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. ఈ క్రమంలో అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

7 రోజుల్లో పూర్తి చేయాలి..

PM కిసాన్ లబ్ధిదారులు e-KYC (PM Kisan e-KYC) పూర్తి చేయడం చాలా ముఖ్యం. మీరు ఇంకా KYC (e-KYC) చేయకుంటే, తదుపరి వాయిదాకు డబ్బులు మీ ఖాతాలో పడవు. ఇది కాకుండా, మీరు ల్యాండ్ డేట్ సీడింగ్ గురించి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీరు మీ బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాలి. అక్టోబరు 15 వరకు రైతులు ఈ పని చేయాలి. ఇప్పుడు ఈ పనులు చేయడానికి మీకు 7 రోజులు మిగిలి ఉన్నాయి.

మిస్సైతే పథకం ప్రయోజనం పొందలేరు..

PM కిసాన్ యోజన (PM Kisan 15th Installment) లబ్ధిదారులు e-KYCని పొందడం అవసరం. మీ KYC చేయకపోతే మీరు పథకం ప్రయోజనం పొందలేరని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.

నవంబర్ వరకు తదుపరి వాయిదా ప్రయోజనం..

నవంబర్‌లో లేదా అంతకు ముందు ఎప్పుడైనా రైతులు తదుపరి విడత ప్రయోజనాన్ని పొందవచ్చని మీకు తెలియజేద్దాం. ప్రస్తుతం, తదుపరి విడత విడుదల తేదీ గురించి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

అధికారిక వెబ్‌సైట్‌ ఇదే..

ఇది కాకుండా, మీరు 15వ విడత స్థితి కోసం pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను కూడా సందర్శించవచ్చు.

Tags:    

Similar News