బ్యాంకు ఖాతాదారులకు షాకింగ్ న్యూస్.. రెండు రోజుల్లో ఆన్‌లైన్‌ లావాదేవీలు బంద్‌!

డెబిట్ కార్డు , క్రెడిట్‌ కార్డులు ఉన్నాయా? అయితే మీరు గుండె నిబ్భరం చేసుకుని ఈ వార్త చదవండి. మార్చి 16 నుంచి మీ క్రిడెట్ కార్డు డిబిట్ కార్డు లావాదేవీలు పనిచేయకపోవచ్చు.

Update: 2020-03-14 12:01 GMT
Debit Cards And Credit Cards

డెబిట్ కార్డు, క్రెడిట్‌ కార్డులు ఉన్నాయా? అయితే మీరు గుండె నిబ్భరం చేసుకుని ఈ వార్త చదవండి. మార్చి 16 నుంచి మీ క్రిడెట్ కార్డు డిబిట్ కార్డు లావాదేవీలు పనిచేయకపోవచ్చు. ఎందుకంటే భారతీయ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొన్ని నిబంధనలే కారణం. డెబిట్ కార్డు, క్రెడిట్‌ కార్డులను మరింత సురక్షితంగా మార్చేందుకు ఆర్‌బీఐ పటిష్ఠ చర్యలు చేపట్టింది. కార్డుల ద్వారా జరిగే మోసాలను అడ్డుకోనేందుకు ఆర్భిఐ అన్ని బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసింది.

మార్చి 16 నుంచి మీ కార్డులతో కేవలం డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే వీలుంది. ఈ నిబంధనల ప్రకారం అంటే ఏటీఎం, పీఓఎస్‌ టెర్మినల్స్‌లో మాత్రమే వినియోగిచుకొవచ్చు. ఇకపై కొత్త కార్డులు జారీ, రెన్యువల్‌ చేసుకునే కార్డులకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని ఆర్బీఐ స్పష‌్టం చేసింది. అయినప్పటికీ అంతర్జాతీయ లావాదేవీలు చేయాలంటే బ్యాకులనుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఉన్న కార్డుల ఆన్‌లైన్‌, అంతర్జాతీయ, కాంటాక్ట్‌లెస్‌ లావాదేవీలు జరగకపోయినా బ్యాంకులు ఈ సదుపాయాలను డీయాక్టివేట్‌ చేస్తాయి. ఇప్పటికే ఎస్‌బీఐ తమ వినియోగదారులకు కొన్ని సదుపాయాలను తొలిగించామని అవసరమైతే తమకు తెలియజేయాలని ఎస్‌ఎంస్ సందేశం పంపించింది.

ఆర్‌బీఐ నూతన నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌, అంతర్జాతీయ లావాదేవీలను డీయాక్టివేట్‌ చేసే అధికారం బ్యాంకులకు ఉంది. ఇకపై వినియోగదారులు సంబంధిత కార్డులను ఏటీఎంల ద్వారా స్విచ్‌ ఆఫ్/ఆన్‌ చేసుకొనే సౌకర్యం కల్పిస్తున్నాయి. కాగా.. లావాదేవిలు ఏమి జరగకపోతే ఈ సదుపాయం ఉపయోగపడుతుంది.

 

Tags:    

Similar News