LPG Price Hike: కొత్త సంవత్సరం షాక్.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి
LPG Price Hike: కొత్త సంవత్సరం 2026 ప్రారంభంతోనే గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ ఎదురైంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ (LPG) సిలిండర్ ధరలను భారీగా పెంచాయి.
LPG Price Hike: కొత్త సంవత్సరం షాక్.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి
LPG Price Hike: కొత్త సంవత్సరం 2026 ప్రారంభంతోనే గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ ఎదురైంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ (LPG) సిలిండర్ ధరలను భారీగా పెంచాయి. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన తాజా ధరల ప్రకారం, 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రూ. 111 పెరిగింది. దీంతో పండుగ, పెళ్లిళ్ల సీజన్‌లో వ్యాపారస్తులకు ఇది గట్టి షాక్‌గా మారింది.
తాజా పెరుగుదలతో దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు దాదాపు రూ. 1,850 వరకు చేరుకున్నాయి. అయితే గృహ వినియోగదారుల కోసం ఉన్న దేశీయ (డొమెస్టిక్) ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.
మెట్రో నగరాల్లో తాజా ధరలు ఇలా ఉన్నాయి
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) విడుదల చేసిన డేటా ప్రకారం, వాణిజ్య గ్యాస్ ధరలు నవంబర్ 2023 తర్వాత రూ. 100కు పైగా పెరగడం ఇదే తొలిసారి. అక్టోబర్ 2023 తర్వాత ఇది అతిపెద్ద పెరుగుదలగా అధికారులు చెబుతున్నారు.
ఢిల్లీ: రూ. 111 పెరిగి ₹1,691.50
కోల్‌కతా: రూ. 111 పెరిగి ₹1,795
ముంబై: రూ. 111 పెరిగి ₹1,642.50
చెన్నై: రూ. 110 పెరిగి ₹1,849.50
ఈ ధరల పెరుగుదలతో హోటళ్లు, క్యాటరింగ్, చిన్న వ్యాపారాలపై భారం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.