Mera Ration 2.0: కొత్త సంవత్సరంలో రేషన్ కార్డు అవసరం ఉండదు.. ఈ యాప్‌తోనే అన్ని పనులు జరుగుతాయి..!
Mera Ration 2.0: కొత్త సంవత్సరంలో రేషన్ కార్డు అవసరం ఉండదు. అన్ని పనులు ఈ యాప్ ద్వారానే జరుగుతాయి.
Mera Ration 2.0: కొత్త సంవత్సరంలో రేషన్ కార్డు అవసరం ఉండదు.. ఈ యాప్‌తోనే అన్ని పనులు జరుగుతాయి..!
Mera Ration 2.0: కొత్త సంవత్సరంలో రేషన్ కార్డు అవసరం ఉండదు. అన్ని పనులు ఈ యాప్ ద్వారానే జరుగుతాయి. పేదలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఓ యాప్‌ను విడుదల చేసింది. భారత ప్రభుత్వం "మేరా రేషన్ 2.0" అనే యాప్‌ను ప్రారంభించింది. దీంతో రేషన్ కార్డు లేకున్నా రేషన్ తీసుకోవచ్చు.
ఆధార్ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది
ఈ పథకం మొత్తం దేశ ప్రజలకు సౌకర్యాన్ని అందిస్తుంది. యాప్‌లో సదరు కార్డు దారుడి ఆధార్ నంబర్‌ను నమోదు చేస్తే చాలు. ఆధార్ నంబర్‌ను నమోదు చేసిన వెంటనే, సదరు వినియోగదారుడి పూర్తి వివరాలు ఈ యాప్‌లో కనిపిస్తాయి. దీని తర్వాత ఆ వ్యక్తి పని పూర్తవుతుంది. ఈ యాప్‌ని Google Play Store నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. “మేరా రేషన్ 2.0” యాప్ వినియోగదారుల పనిని సులభతరం చేస్తుంది.
సమయం ఆదా
రేషన్ కార్డుకు సంబంధించిన అన్ని అవసరాలను తీర్చడంలో ఈ యాప్ వినియోగదారులకు సహాయం చేస్తుంది. దీంతో ఇంట్లో కూర్చొని సమయం ఆదా చేసుకుంటూ అన్నీ చేయడం సులభం అవుతుంది. ఈ యాప్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అలాగే దీన్ని ఎలా ఉపయోగించాలి అనే పూర్తి సమాచారం కింద తెలుసుకుందాం. యాప్ పని చేసే విధానానికి వాటిని అనుసరించవచ్చు.
యాప్ డౌన్‌లోడ్ చేయడానికి, ఉపయోగించే మార్గాలు :
* ముందుగా గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి.
* ఆపై “మేరా రేషన్ 2.0” యాప్ కోసం సెర్చ్ చేయాలి.
* యాప్‌ని ఎంచుకుని, ఇన్‌స్టాల్‌పై క్లిక్ చేయండి.
* ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, యాప్‌ని తెరిచి, “బెనిఫిషియరీ యూజర్” ఎంపికను ఎంచుకోండి.
* తర్వాత క్యాప్చా, ఆధార్ నంబర్‌ను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
* ఇప్పుడు రేషన్ కార్డుకు సంబంధించిన అన్ని సర్వీసుల జాబితా మీ ముందు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
* ఆ తర్వాత అవసరమైన సమాచారాన్ని పూరించండి. సబ్మిట్ చేయండి.