ఈ బ్యాంకులో ఖాతా ఉందా.. సెప్టెంబర్ 20 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు..!

ఈ బ్యాంకులో ఖాతా ఉందా.. సెప్టెంబర్ 20 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు..!

Update: 2022-09-07 12:30 GMT

ఈ బ్యాంకులో ఖాతా ఉందా.. సెప్టెంబర్ 20 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు..!

Canara Bank: కెనరా బ్యాంకులో అకౌంట్ ఉందా.. అయితే మీకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే బ్యాంకు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సర్వీస్ ఛార్జీని పెంచింది. ఖాతా ఉన్న బ్యాంక్ బ్రాంచ్‌లో ఇతర బ్యాంక్ బ్రాంచ్‌లో రెండింటికి సర్వీస్ ఛార్జీ పెంచింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా, నాన్ బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ ఖాతా రెండింటికీ సర్వీస్ ఛార్జీ పెంచింది. కెనరా బ్యాంక్ ప్రకారం మార్చబడిన సర్వీస్ ఛార్జీలు సెప్టెంబర్ 20 నుంచి అమలవుతాయి. సెప్టెంబరు 20 వరకు పాత ధరలకే బ్యాంకింగ్ సేవలని పొందవచ్చు.

నాన్ బేసిక్ సేవింగ్స్ ఖాతా ఛార్జీలు

1. మీరు మరొక బ్రాంచ్‌లో చేసిన ఆర్థిక లావాదేవీలకి (నగదు డిపాజిట్ లేదా నగదు విత్ డ్రా లేదా ఫండ్ బదిలీ) రూ.30తో పాటు GST చెల్లించాలి.

2. ఇతర బ్యాంక్ బ్రాంచ్ నుంచి మినీ స్టేట్‌మెంట్‌ తీయడం వంటి ఆర్థికేతర లావాదేవీలకి రూ.6తో పాటు GST చెల్లించాలి.

3. కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో నగదు విత్ డ్రా వంటి ఆర్థిక లావాదేవీల కోసం నెలలో 4 నగదు విత్ డ్రాల తర్వాత ప్రతి లావాదేవీకి రూ.25 GST చెల్లించాలి.

4. కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో మినీ స్టేట్‌మెంట్‌కి ఎటువంటి ఛార్జీలు ఉండవు.

బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలు

కెనరా బ్యాంక్, ఇతర బ్యాంక్ బ్రాంచ్‌లలో నగదు విత్ డ్రా లేదా ఫండ్ బదిలీ డెబిట్ వంటి ఆర్థిక లావాదేవీలు ప్రతి లావాదేవీకి రూ.20 ప్లస్ GST చెల్లించాలి. అయితే బ్రాంచ్ ATM లేదా ఏదైనా బ్యాంక్ బ్రాంచ్ నుంచి ఒక నెలలో 4 లావాదేవీలు జరిగినప్పుడు ఈ నియమం వర్తిస్తుంది. కెనరా బ్యాంక్‌తో పాటు మరికొన్ని బ్యాంకులు కూడా సర్వీస్ ఛార్జీలను పెంచాయి. ఈ బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, యెస్ బ్యాంక్ ఉన్నాయి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్

పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (NACH) ఈ-మాండేట్ ఛార్జీని పెంచింది. యెస్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలు, డెబిట్ కార్డులపై సర్వీస్ ఛార్జీని పెంచింది. కొత్త ఛార్జీలు 1 సెప్టెంబర్ 2022 నుంచి అమలులోకి వచ్చాయి.

Tags:    

Similar News