గ్యాస్‌ సిలిండర్‌పై రూ.1100 ఆదా చేయండి.. పైసా ఖర్చు లేకుండా వంట చేయండి..!

Buy Solar Stove: నేటి రోజుల్లో వంటగ్యాస్‌ ధరలు మోతమోగుతున్నాయి.

Update: 2023-07-08 08:30 GMT

గ్యాస్‌ సిలిండర్‌పై రూ.1100 ఆదా చేయండి.. పైసా ఖర్చు లేకుండా వంట చేయండి..!

Buy Solar Stove: నేటి రోజుల్లో వంటగ్యాస్‌ ధరలు మోతమోగుతున్నాయి. నెల నెలకి ధరలలో మార్పు కనిపిస్తుంది. ప్రస్తుతం గ్యాస్‌ ధర దాదాపు రూ.1100 పలుకుతోంది. సామాన్యులకి ఇంత పెద్ద మొత్తం చెల్లించడం కష్టంగా మారింది. నిరంతరం పెరుగుతున్న ద్రవ్యోల్బణం సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతోంది. దీంతో వంటగ్యాస్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రత్యామ్నాయ పద్దతులని ఎంచుకోవాలి. పెరిగిన గ్యాస్‌ ధరలకి చెక్‌ పెట్టాలంటే సోలార్ స్టవ్ ఒక్కటే మార్గం. ఎందుకంటే దీని వినియోగానికి గ్యాస్, విద్యుత్ అవసరం లేదు. కేవలం సూర్యకాంతి మాత్రమే అవసరం. ఇందుకోసం మీరు ఒక్క పైసా కూడా ఖర్చు చేయనవసరం లేదు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సోలార్ స్టవ్‌ ఉపయోగించడానికి సోలార్ ప్యానెల్ అవసరం అవుతాయి. వీటి ద్వారా సోలార్ స్టవ్ రన్ అవుతూనే ఉంటుంది. ఇది సూర్య కిరణాల ద్వారా ఛార్జ్ అవుతుంది. దీనిని ఒకసారి ఛార్జ్ చేయడం ద్వారా 3 సార్లు ఆహారాన్ని వండుకోవచ్చు. భారతదేశంలోని ప్రముఖ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) ఇంటి లోపల ఉపయోగించే సోలార్ స్టవ్‌ను తయారు చేసింది. సూర్యకిరణాల వల్ల ఛార్జ్ అయ్యే ఈ స్టవ్ వంటగదిలో పెట్టుకుని వాడుకోవచ్చు. దీని మెయింటనెన్స్‌కి ఎలాంటి ఖర్చు ఉండదు.

ప్రధాని మోదీ ఈ స్టవ్‌ను ప్రారంభించారు. ఈ సోలార్ స్టవ్ వల్ల దేశంలోని సామాన్య ప్రజలు 7 ఏళ్లలో లక్ష కోట్ల రూపాయలు ఆదా చేయనున్నారు. ఎందుకంటే ఇది సూర్య కిరణాల ద్వారా ఛార్జ్ అవుతుంది. ఈ స్టవ్ జీవితకాలం దాదాపు 10 సంవత్సరాలు ఉంటుంది. దీనికి సోలార్ ప్యానెల్‌కు కూడా కనెక్ట్ చేయవచ్చు. స్టవ్ కేబుల్ వైర్ సోలార్ ప్లేట్‌కు కనెక్ట్ చేస్తారు. ఇది సూర్య కిరణాల నుంచి శక్తిని పొందుతుంది. ఎక్కువైన ఎనర్జీని స్టోరేజ్‌ చేస్తుంది. డబ్బు ఖర్చు లేకుండా భోజనం సులభంగా వండుకోవచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే రాత్రిపూట కూడా వంట చేసుకోవచ్చు.

ఈ సోలార్ స్టవ్ కొనాలంటే మార్కెట్‌లో 15 నుంచి 30 వేల రూపాయల ధర పలుకుతోంది. అయితే ఈ సోలార్ స్టవ్ పై ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. సబ్సిడీపై సోలార్ స్టవ్ తీసుకుంటే రూ.10 వేలలో లభిస్తుంది. ఈ సోలార్ స్టవ్‌ను అమర్చిన తర్వాత గ్యాస్ లేకుండా ఆహారాన్ని సులభంగా వండుకోవచ్చు. ఈ స్టవ్ హైబ్రిడ్ మోడ్‌లో కూడా పనిచేస్తుంది. అంటే సౌరశక్తితో పాటు విద్యుత్తును కూడా ఈ స్టవ్‌లో ఉపయోగించవచ్చు.

Tags:    

Similar News