Bharti Airtel Q1 Results: భారతీ ఎయిర్‌టెల్ లాభాల్లో జంప్, రూ.5,947 కోట్ల నికర ఆదాయం
ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ 2025–26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక (Q1) ఫలితాలను విడుదల చేసింది. జూన్ 2025తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.5,947 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
Bharti Airtel Q1 Results: భారతీ ఎయిర్‌టెల్ లాభాల్లో జంప్, రూ.5,947 కోట్ల నికర ఆదాయం
ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ 2025–26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక (Q1) ఫలితాలను విడుదల చేసింది. జూన్ 2025తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.5,947 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే క్వార్టర్‌లో నమోదైన రూ.4,159 కోట్లతో పోలిస్తే సుమారు 43 శాతం వృద్ధిని సూచిస్తోంది.
ఆదాయంలో భారీ వృద్ధి
సమీక్షా త్రైమాసికంలో మొత్తం కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 28% వృద్ధితో రూ.49,463 కోట్లు కాగా, గతేడాది ఇదే సమయంలో ఇది రూ.38,506 కోట్లు.
భారతీ ఎయిర్‌టెల్ ఇండియా విభాగానికి చెందిన ఆదాయం 29 శాతం పెరిగి రూ.37,585 కోట్లు చేరింది.
ARPUలో పెరుగుదల
టెలికాం రంగంలో కీలక సూచికగా పరిగణించే ARPU (Average Revenue Per User) కూడా పెరిగింది. గతేడాది రూ.211 ఉండగా, ఈ ఏడాది అది రూ.250 కు చేరుకుంది. ఇది వినియోగదారుల వద్ద నుంచి ఎక్కువ ఆదాయం రావడాన్ని సూచిస్తుంది.
షేరు విలువ slight rise
ఈ ఫలితాల ప్రభావంతో, మార్కెట్లో భారతీ ఎయిర్‌టెల్ షేరు విలువ 0.82 శాతం పెరిగి రూ.1,930.30 వద్ద ముగిసింది.
ఈ ఫలితాలు ఎయిర్‌టెల్ టెలికాం రంగంలో తన స్థిరమైన గ్రోత్‌ను కొనసాగిస్తోందని స్పష్టంగా సూచిస్తున్నాయి. ARPU మెరుగవడం, ఆదాయవృద్ధి కొనసాగడం సంస్థకు బలాన్ని ఇస్తున్న అంశాలు.