Bharat Taxi: నేటి నుంచే ‘భారత్ టాక్సీ’ సేవలు.. ఓలా, ఉబర్‌లకు కేంద్రం నుంచి గట్టి పోటీ
Bharat Taxi: ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ క్యాబ్ సేవలకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ‘భారత్ టాక్సీ’ సేవలను దేశవ్యాప్తంగా జనవరి 1 నుంచి ప్రారంభించింది.
Bharat Taxi: నేటి నుంచే ‘భారత్ టాక్సీ’ సేవలు.. ఓలా, ఉబర్‌లకు కేంద్రం నుంచి గట్టి పోటీ
Bharat Taxi: ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ క్యాబ్ సేవలకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ‘భారత్ టాక్సీ’ సేవలను దేశవ్యాప్తంగా జనవరి 1 నుంచి ప్రారంభించింది. ప్రైవేట్ యాప్‌లు అధిక చార్జీలు వసూలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలకు చౌకగా, సురక్షితంగా ప్రయాణ సదుపాయం కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వ సేవలను ప్రవేశపెట్టారు.
భారత్ టాక్సీ యాప్ ద్వారా బైక్, ఆటో, కారు వంటి వాహనాలను బుక్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఇప్పటికే కొన్ని నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ సేవలకు మంచి స్పందన రావడంతో, ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు.
ప్రైవేట్ యాప్‌లలో రైడ్ బుక్ చేసిన తరువాత రైడర్లు లేదా డ్రైవర్లు రద్దు చేయడం, డ్రైవర్లు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు తరచూ ఎదురవుతున్నాయి. దీనివల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులకు చెక్ పెట్టేందుకు భారత్ టాక్సీ యాప్‌లో డ్రైవర్లు ఎక్కువగా రిజిస్టర్ చేసుకునేలా కేంద్రం ప్రోత్సాహకాలు అందించనుంది. దీనివల్ల బుకింగ్ వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
తక్కువ ధరలు, ప్రభుత్వ పర్యవేక్షణ, వినియోగదారుల భద్రత వంటి అంశాలతో భారత్ టాక్సీ యాప్ ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు డ్రైవర్లకు కూడా ఎక్కువ బుకింగ్స్ రావడం ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉండటంతో, ఈ సేవలు వేగంగా ప్రజల్లోకి వెళ్లనున్నాయని అంచనా వేస్తున్నారు.