Bank Loans: లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే EMI ఎవరు చెల్లించాలి?

ఈ రోజుల్లో అత్యవసర పరిస్థితుల్లో లోన్ తీసుకోవడం సాధారణ విషయం అయిపోయింది. కానీ రుణగ్రహీత మరణిస్తే, ఆ లోన్ చెల్లించేది ఎవరు? రద్దు చేస్తారా? అనేది చాలా మందికి తెలియని విషయం. బ్యాంకులు రుణ రకాన్ని బట్టి వసూలు చేసే విధానం వేర్వేరుగా ఉంటుంది.

Update: 2025-07-25 15:12 GMT

పర్సనల్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే?

పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ అన్‌సెక్యూర్డ్ లోన్స్ కేటగిరీలోకి వస్తాయి. రుణగ్రహీత మరణించిన తర్వాత, బ్యాంకులు కుటుంబసభ్యులు లేదా వారసులపై లోన్ వసూలు చేయవు. గ్యారంటీ ఇచ్చిన వ్యక్తి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే?

హోమ్ లోన్ సాధారణంగా సెక్యూర్డ్ లోన్ కాబట్టి, రుణగ్రహీతతో పాటు కో-అప్లికెంట్ ఉంటాడు. రుణగ్రహీత మరణించినట్లయితే, EMI చెల్లించే బాధ్యత కో-అప్లికెంట్ లేదా జాయింట్ బారోవర్‌పై పడుతుంది.

రుణగ్రహీత మరణించిన వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి.

మరణించిన వ్యక్తి పేరులోని అకౌంట్ మూసివేస్తారు, లోన్‌ను కో-అప్లికెంట్ పేరుపైకి ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం ఉంటుంది.

ఇన్సూరెన్స్ ఉంటే ప్రయోజనం

హోమ్ లోన్ తీసుకున్నప్పుడు లోన్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే, రుణగ్రహీత మరణించిన సందర్భంలో ఇన్సూరెన్స్ కంపెనీ మిగిలిన బకాయిలను క్లియర్ చేస్తుంది. దీంతో కో-అప్లికెంట్‌కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అయితే, పర్సనల్ లోన్స్‌కు ఇలాంటి సదుపాయం చాలా అరుదు.

లోన్ తీసుకునే ముందు ఇన్సూరెన్స్ ఆప్షన్‌పై ఆలోచించడం, కో-అప్లికెంట్ వివరాలను సరిగ్గా నమోదు చేయడం చాలా అవసరం.

Tags:    

Similar News