Pension Scheme: ఈ ప్రభుత్వ పథకంలో రోజు 7 రూపాయలు ఆదా చేస్తే ఏడాదికి 60 వేల పెన్షన్..!

Pension Scheme: ఈ ద్రవ్యోల్బణం యుగంలో ప్రతి ఒక్కరూ వృద్ధాప్య ఖర్చుల గురించి ఆందోళన చెందుతున్నారు...

Update: 2022-04-19 06:45 GMT

Pension Scheme: ఈ ప్రభుత్వ పథకంలో రోజు 7 రూపాయలు ఆదా చేస్తే ఏడాదికి 60 వేల పెన్షన్..!

Pension Scheme: ఈ ద్రవ్యోల్బణం యుగంలో ప్రతి ఒక్కరూ వృద్ధాప్య ఖర్చుల గురించి ఆందోళన చెందుతున్నారు. మీరు కూడా మీ వృద్ధాప్యంలో టెన్షన్ పడకూడదంటే తప్పకుండా ఈ విషయం తెలుసుకోండి. అటల్ పెన్షన్ యోజన(Atal Pension Yojana) 2015 సంవత్సరంలో ప్రారంభించారు. ఇంతకుముందు ఈ పథకం అసంఘటిత రంగాలలో పనిచేసే వ్యక్తుల కోసం ప్రారంభించారు. కానీ ఇప్పుడు 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో డిపాజిటర్లు 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ పొందడం ప్రారంభిస్తారు. ఈ పథకం కింద మీరు నెలవారీ కనిష్టంగా రూ.1,000, రూ. 2000, రూ. 3000, రూ. 4000, గరిష్టంగా రూ. 5,000 పెన్షన్ పొందవచ్చు. మీరు ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలనుకుంటే సేవింగ్స్ ఖాతా, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ కలిగి ఉండాలి.

ఈ పథకం ప్రయోజనాలు

ఈ ప్రభుత్వం పథకంలో ఎంత త్వరగా పెట్టుబడి పెడితే అంత ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయస్సులో అటల్ పెన్షన్ యోజనలో చేరినట్లయితే 60 సంవత్సరాల వయస్సు తర్వాత అతను ప్రతి నెలా రూ. 5000 నెలవారీ పెన్షన్ పొందుతాడు. ఇందుకోసం అతడు నెలకు కేవలం రూ. 210 డిపాజిట్ చేస్తే చాలు. అంటే ప్రతిరోజూ రూ. 7 డిపాజిట్ చేస్తే నెలకు రూ. 5000 పెన్షన్ పొందవచ్చు. ఏడాదికి 60,000లు అవుతుంది. అదే సమయంలో మీరు ప్రతి నెలా 42 రూపాయలు డిపాజిట్ చేస్తే నెలవారీ పెన్షన్ 1000 రూపాయలు. రూ.2000 పెన్షన్ కావాలంటే రూ.84 పెట్టుబడి పెట్టాలి. నెలవారీ పెన్షన్ రూ. 3000 కావాలంటే నెలకి రూ.126 పెట్టుబడి పెట్టాలి. నెలవారీ రూ.4000 పెన్షన్ పొందాలనుకుంటే ప్రతి నెలా రూ.168 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

ఈ పథకం యొక్క అతిపెద్ద లక్షణం ఇందులో పన్ను ప్రయోజనం ఉంటుంది. అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టే వ్యక్తులు ఆదాయపు పన్ను(Income Tax) చట్టం 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందుతారు. ఈ పథకం కింద పెట్టుబడిదారుడు 60 ఏళ్లలోపు మరణిస్తే అతని భార్య/భర్త ఈ పథకంలో డబ్బును డిపాజిట్ చేయడం కొనసాగించవచ్చు. 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా పెన్షన్ పొందవచ్చు. భార్య లేదా భర్త మరణించిన తర్వాత ఏకమొత్తాన్ని క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. భార్య మరణిస్తే ఆమె నామినీకి ఏకమొత్తం అందుతుంది.

Tags:    

Similar News