Aadhaar Update: ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు ఉన్నాయా? ఇక నుంచి ఇంటి నుంచే ఆధార్ అప్ డేట్స్..
Aadhaar Update: ఆధార కార్డులను అడ్రస్ కోసమో లేక పేరు కోసమో ఫొటో కోసమే ఇలా ఏదో ఒక కారణంతో దానిని అప్ డేట్స్ చేస్తూ ఉండాలి.
Aadhaar Update: ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు ఉన్నాయా? ఇక నుంచి ఇంటి నుంచే ఆధార్ అప్ డేట్స్..
Aadhaar Update: ఆధార కార్డులను అడ్రస్ కోసమో లేక పేరు కోసమో ఫొటో కోసమే ఇలా ఏదో ఒక కారణంతో దానిని అప్ డేట్స్ చేస్తూ ఉండాలి. దీనికోసం ఇప్పటివరకు ఆధార్ కేంద్రాలకు వెళ్లి చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆధార్ కార్డులో ఎటువంటి మార్పులు చేయాలన్నా ఇక ఇంటి నుంచే UIDAI E AADHAAR ద్వారా చేసుకోవచ్చు. ఈ యాప్ గురించి వివరాలు తెలుసుకుందాం.
ఇప్పటివరకు ఆధార్ కేంద్రాల్లో మాత్రమే జరిగే అధార్ కార్డులోని మార్పులు, చేర్పులు ఇక నుంచి ఇంటి నుంచే చేయొచ్చని యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) తెలిపింది. ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ ఆధార్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే చాలు ఏ ఆధార్ కేంద్రానికి వెళ్లనవసరం లేకుండానే వారి పేర్లు, ఇంటిపేర్లు, చిరునామా, పుట్టినతేదీ , మొబైల్ నంబర్ వంటి కీలకమైన సమాచారాన్ని ఆప్ డేట్ చేసుకోవచ్చు.
ఇప్పటికే ఆధార్ కార్డులో ఉన్న మార్పులు ఉచితంగా చేసుకునే అవకాశం..2026 జూన్ 14వ తేదీ వరకు ఇచ్చింది. అయితే ఇక నుంచి ఆధార్ లో ఎటువంటి మార్పులు చేయాలన్నా ఈ ఆధార్ యాప్ ద్వారా చేయొచ్చు.