8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. 4% పెరగనున్న జీతాలు
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్. ప్రభుత్వం 8వ వేతన సంఘానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. 4% పెరగనున్న జీతాలు
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్. ప్రభుత్వం 8వ వేతన సంఘానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది జీతాలు, పెన్షన్, భత్యాలలో మార్పులు తీసుకువస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కేంద్ర ప్రభుత్వం జనవరి 2026 నాటికి 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఈ కమిషన్ తన సిఫార్సులను 2025 చివరి నాటికి ప్రభుత్వానికి సమర్పిస్తుందని తెలుస్తోంది. ప్రణాళిక ప్రకారం అంతా జరిగితే, 2026 ప్రారంభం నుంచే ఇది అమల్లోకి వస్తుంది. ఒకవేళ ప్రక్రియలో ఏమైనా జాప్యం జరిగితే 2027 వరకు కూడా ఆలస్యం కావచ్చు. 8వ వేతన సంఘం సుమారు 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇందులో రక్షణ రంగంలో రిటైర్ అయిన సిబ్బంది కూడా ఉన్నారు. అంటే, మొత్తం కోటి మందికి పైగా ప్రజలు ఈ కమిషన్ సిఫార్సుల ద్వారా లబ్ధి పొందుతారు.
ఇది అమల్లోకి వస్తే జీతంలో 30 నుంచి 34 శాతం వరకు పెంపు ఉండవచ్చు. కనీస బేసిక్ జీతం రూ.18,000 నుంచి రూ.51,480 వరకు పెరగవచ్చు. దీనివల్ల ఉద్యోగుల జేబుల్లోకి మరింత ఎక్కువ డబ్బు వస్తుంది. అయితే, ఇవి కేవలం అంచనాలు మాత్రమే.. తుది లెక్కలు కమిషన్ సిఫార్సుల తర్వాతే స్పష్టమవుతాయి. ప్రభుత్వం జీతం పెంచడానికి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉపయోగిస్తుంది. 7వ వేతన సంఘంలో ఈ ఫ్యాక్టర్ 2.57 గా ఉంది. దీని అర్థం, బేసిక్ జీతాన్ని 2.57 తో గుణించి కొత్త జీతాన్ని నిర్ణయించారు. ఈ ప్రక్రియలో DA సున్నాకు తగ్గించి, కొత్తగా DA లెక్కించడం మొదలుపెడతారు. 8వ వేతన సంఘంలో కూడా ఇదే జరుగుతుంది. కొత్త బేసిక్ సాలరీ నిర్ణయిస్తారు.
ప్రభుత్వం గత కొన్ని వేతన సంఘాల నుంచి జీతం స్వరూపాన్ని మరింత సులభతరం చేయడానికి ప్రయత్నిస్తోంది. 6వ వేతన సంఘంలో పే బ్యాండ్, గ్రేడ్ పే విధానం వచ్చింది. 7వ వేతన సంఘం పే మ్యాట్రిక్స్‌ను తీసుకువచ్చి దీనిని మరింత సరళీకరించింది. దీనిలో ప్రతి ఉద్యోగి జీతం వారి లెవల్ బట్టి నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఉన్న జీతంలో బేసిక్ పే వాటా సుమారు 51.5%, డిఎ 30.9%, హెచ్‌ఆర్ఎ 15.4%, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ 2.2% ఉంటుంది. 8వ వేతన సంఘం దీనిని మరింత పారదర్శకంగా, సులభంగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. కొత్త స్వరూపం మరింత మెరుగ్గా ఉంటుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. జీతంలో 30-34% పెంపు ఉంటే, ప్రభుత్వంపై ప్రతి సంవత్సరం సుమారు రూ.1.8 లక్షల కోట్లు అదనపు భారం పడవచ్చు. ఇది చిన్న మొత్తం కాదు, కానీ దేశ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం దీనిని తప్పనిసరిగా భావిస్తోంది.