New Trains: రైలు ప్రయాణికులకు విజ్నప్తి.. దేశవ్యాప్తంగా 200 కొత్త రైళ్లు రానున్నాయ్
New Trains: ఈ దేశంలో అన్ని రంగాలకంటే రైలు రంగమే ఎక్కువ వెనుకబడి ఉంటోందని చెప్పొచ్చు.
New Trains: ఈ దేశంలో అన్ని రంగాలకంటే రైలు రంగమే ఎక్కువ వెనుకబడి ఉంటోందని చెప్పొచ్చు. ఎందుకంటే బ్రిటీష్ కాలం నాటి ట్రాక్కులు, రైళ్లే ఇంకా నడిస్తున్నాయ్. మధ్య అప్పుడప్పుడు కొన్ని కొత్త రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే తాజాగా దేశవ్యాప్తంగా 200 కొత్త రైళ్లను పట్టాలెక్కించునున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ కొత్త రైళ్లలో 50 నమో భారత్ రైళ్లు మరియు 100 మెమూ రైళ్లు, 50 అమృత్ భారత్ రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లన్నీ కూడా ప్రయాణికులకు సౌకర్యం, భధ్రతను దృష్టిలో పెట్టుకుని తయారుచేసినవి.
గతంలో నమో భారత్ రైళ్లను వందే మెట్రోగా పిలిచేవారు. ఏసీ సౌకర్యంతో ఉండే ఈ రైళ్లు తక్కువ దూరం కోసం ఉపయోగిస్తారు. ఇవి గంటకు 130 కిమీ వేగంతో ప్రయాణిస్తాయి. అంతేకాదు ఈ రైళ్లు వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఫ్టాట్ పామ్‌పైన నిర్మించిన రైళ్లు.
కొత్త రైళ్లను సిద్దం చేయడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటే.. ఇప్పటివరకు ఉన్న రైళ్లలో ప్రయాణికులకు సరైన సదుపాయాలు లేవు. ఏసీ ఉండదు. కానీ ఈ కొత్త రైళ్లు ఇప్పుటు అధునిక సౌకర్యాలతో ఉంటాయి. సీటింగ్, స్టాండింగ్ ఏర్పాట్లు కూడా ఎంతో అందంగా ఉంటాయి. అలాగే ఈ రైళ్లలో వాక్యూమ్ ఆధారిత టాయిలెట్స్, మెరుగైన యాక్సిలరేషన్, డీసెలరేషన్ సామర్ధ్యాలు ఉన్నాయి. పూర్తిగా సీల్డ్ గ్యాంగ్ వేలు ఉంటాయి. ఇవి శుభ్రమైన సురక్షితమైన వాతావరాణాన్ని కలిగి ఉంటాయి. సీల్డ్ గ్యాంగ్ వేల వల్ల విండోలు మూసి ఉంటాయి. దీనివల్ల బయట నుంచి దుమ్ము, దూళి అనేవి రాకుండా ఉంటాయి.