Shahid Afridi Foundation: అఫ్రిది ఫౌండేషన్‌ లోగోతో మైదానంలోకి పాక్‌ ఆటగాళ్ళు!

Shahid Afridi Foundation: కరోనా వలన నష్టపోయిన రంగాలలో క్రికెట్ ఒకటి.. మ్యాచ్ లు లేకా అన్ని క్రికెట్‌ బోర్డుల ఆదాయాలు పడిపోయాయి..

Update: 2020-07-10 07:45 GMT
Pakistan Cricketers with Shahid Afridi Foundation Logo

Shahid Afridi Foundation: కరోనా వలన నష్టపోయిన రంగాలలో క్రికెట్ ఒకటి.. మ్యాచ్ లు లేకా అన్ని క్రికెట్‌ బోర్డుల ఆదాయాలు పడిపోయాయి.. ఈ క్రమంలో స్పాన్సర్లు లేకా సతమతమవుతోంది పాకిస్తాన్.. ఆగస్టులో ఇంగ్లాండ్‌తో జరగబోయే సిరీస్‌లో భాగంగా జాతీయ జట్టుకు స్పాన్సర్‌షిప్‌ అందించేందుకు ఏ కంపెనీ కూడా ముందుకు రాలేదు. దీనితో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్‌ అఫ్రిదికి చెందిన ఛారిటీ ఫౌండేషన్‌ లోగోను ధరించాలని పీసీబీ( పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు) నిర్ణయించింది.

తాజాగా కరోనా నుంచి కోలుకున్న షాహిద్‌ అఫ్రిది ఈ విషయాన్నీ వెల్లడించాడు. ఇంగ్లాండ్‌ టూర్‌లో పాక్ క్రికెటర్ల కిట్లపై తమ ఫౌండేషన్‌ లోగో ఉంటున్నందుకు తనకి ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు పీసీబీతో సహా, సీఈవో వసీం ఖాన్‌కు అఫ్రిది ధన్యవాదాలు చెప్పాడు. అలాగే ఈ పర్యటనలో పాక్‌ జట్టు విజయం సాధించాలని కోరుకుంటున్నట్లుగా అఫ్రిది వెల్లడించాడు. ఇక అంతకుముందు పానీయాల సంస్థ పెప్సీతో పిసిబి ఒప్పందం ముగిసిన సంగతి తెలిసిందే..

ఇక తాజాగా తమతో స్పాన్సర్‌షిప్‌ చేసుకొనేందుకు ఓ కార్పొరేట్‌ సంస్థ సిద్ధంగా ఉందని, ప్రస్తుతం దానిపైన చర్చలు జరుగుతున్నాయని పీసీబీ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే తాము అనుకున్న దాని కన్నా చాలా తక్కువ మొత్తం చెల్లించేందుకు ఆ సంస్థ ముందుకొచ్చిందని, అది కూడా గతంలో చెల్లించిన మొత్తంలో 40 శాతమేనని ఆ అధికారి వెల్లడించాడు.

ఇక ఆగస్టులో ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం ఇప్పటికే పాక్‌ జట్టు ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు. ఇందులో ఆగస్టు 5 నుంచి 25 వరకు మూడు టెస్టులు జరగగా, ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 1 వరకు మూడు టీ20లు జరగనున్నాయి. దీనికి ముందు ఆటగాళ్లకి పలుమార్లు కరోనా టెస్టులు నిర్వహించింది పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు. ఇందులో నెగిటివ్ అని వచ్చిన వారిని మాత్రమే ఇంగ్లాండ్‌కు పంపించింది బోర్డు.. 

Tags:    

Similar News