Ugadi 2026: ఉగాది పండుగ 2026 ఎప్పుడు? తేదీ, సమయం, పూర్తి వివరాలు

Ugadi 2026 ఎప్పుడు? ఉగాది పండుగ 2026 తేదీ, తిథి ప్రారంభం–ముగింపు సమయం, పరాభవ నామ సంవత్సరం వివరాలు, ఉగాది పచ్చడి ప్రాముఖ్యతతో సహా పూర్తి సమాచారం.

Update: 2025-12-11 05:41 GMT

తెలుగు ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే తొలి పండుగ ఉగాది. ఇది కొత్త తెలుగు సంవత్సరానికి ఆరంభం. మొత్తం 60 తెలుగు సంవత్సరాలు, 12 తెలుగు మాసాలు ఉన్నట్టు పురాణాలు చెబుతాయి. వాటిలో మొదటి మాసం చైత్రం. చైత్ర మాసం శుక్ల పక్ష పాడ్యమినాడు ఉగాది పండుగను జరుపుకుంటారు.

ఉగాది పండుగ ప్రాముఖ్యత

పురాణాల ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమినాడు బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని, ఆ రోజు నుంచే కృతయుగం ప్రారంభమైందని చెబుతారు. అందుకే ఈ రోజు ‘యుగాది’—అంటే ‘యుగానికి ఆరంభం’ అన్న అర్థం. తరువాత అది ఉగాదిగా మారింది.

Ugadi 2026 Date & Time

2026 ఉగాది పండుగ తేదీ:

  • మార్చి 20, 2026 – శుక్రవారం

పాడ్యమి తిథి ప్రారంభం:

  • మార్చి 19, 2026 – ఉదయం 6:53 AM

తిథి ముగింపు:

  • మార్చి 20, 2026 – ఉదయం 4:52 AM

ఈ రోజుతో విశ్వావసు నామ సంవత్సరం ముగియగా, కొత్తగా పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది.

ఉగాది వివిధ రాష్ట్రాల్లో

తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఈ రోజు పండుగగా జరుపుకుంటారు:

  • మరాఠీలు – గుడిపడవా
  • తమిళులు – పుత్తాండు
  • మలయాళీలు – విషు
  • సిక్కులు – వైశాఖి

పేర్లు వేరు కానీ ఆధ్యాత్మిక సారం ఒక్కటే.

ఉగాది పచ్చడి – ఆరు రుచుల సందేశం

ఉగాది రోజున ప్రత్యేకంగా ఉగాది పచ్చడి తింటారు. ఇందులో ఆరు రుచులు ఉంటాయి:

  1. తీపి
  2. చేదు
  3. వగరు
  4. పులుపు
  5. ఉప్పు
  6. కారం

ఈ ఆరు రుచులు జీవితంలోని సుఖ–దుఃఖాలు, అనుభవాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని అందిస్తాయి. ఆరోగ్యానికి కూడా ఇది మంచిదే. వేసవి తాపాన్ని తగ్గించి దేహాన్ని చల్లబరుస్తుంది.

ఉగాది రోజున ఏం చేస్తారు?

  1. ఆలయాలకు వెళ్లి పంచాంగ శ్రవణం వినడం
  2. కొత్త సంవత్సరానికి సంబంధించిన రాశిఫలాలు, ఆదాయ–వ్యయ వివరాలు, వర్షపాతం, గ్రహస్థితులు వింటడం
  3. కవుల కవిసమ్మేళనాలు
  4. ఇంటింటా పూజలు, శుభారంభాలు

కొత్త సంవత్సరంలో శాంతి, ఆనందం, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ ఉగాది పండుగను జరుపుకుంటారు.

Tags:    

Similar News