Vastu Tips: ఇంట్లో ఈ చోట్లో డబ్బు పెట్టొద్దు..! లక్ష్మీదేవి కృప కోల్పోతారు

Vastu Tips: లక్ష్మీదేవి కటాక్షం కోసం ఇంట్లో డబ్బు పెట్టొద్దని చెబుతున్న స్థలం – అక్కడ పెడితే సంపాదన వృథా!

Update: 2025-06-10 05:44 GMT

Vastu Tips: ఇంట్లో ఈ చోట్లో డబ్బు పెట్టొద్దు..! లక్ష్మీదేవి కృప కోల్పోతారు

 Vastu Tips: ఇన్ని కష్టపడినా కొంతమందికి డబ్బు నిలవదు, ఊహించని ఖర్చులు తలెత్తుతుంటాయి. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, దీని వెనుక లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవడం ఓ ప్రధాన కారణం కావొచ్చు.

ధన, ఐశ్వర్యాల దేవత అయిన లక్ష్మీ తల్లి కృప లేకపోతే సంపాదించిన డబ్బు నిలవదు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో కొన్ని చోట్ల డబ్బు పెట్టడం వల్ల ఆమె అసంతృప్తికి గురవుతారు.

📌 ఈ చోట్ల డబ్బు పెట్టవద్దు:

వాస్తు నిపుణుల ప్రకారం, దక్షిణ దిశను యమధర్మరాజు దిశగా పరిగణిస్తారు. అక్కడ డబ్బు పెట్టడం వల్ల దారిద్య్రం, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయని చెబుతున్నారు. అలాగే, డబ్బు ఉంచే అల్మారాను బాత్రూమ్ పక్కన పెట్టడం వల్ల కూడా ప్రతికూల శక్తులు ప్రభావితం చేస్తాయి.

📌 ఎక్కడ పెట్టాలి?

డబ్బును ఉంచే అల్మారాను ఉత్తర దిశ లేదా ఉత్తర-తూర్పు మూల (ఈశాన్యం) లో పెట్టాలి. ఇది లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందే ఉత్తమ దిశ. అల్మారా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి, చీకటి చోట్ల కాకుండా కాంతివంతమైన ప్రదేశంలో ఉంచాలి.

Tags:    

Similar News