Navratri 2025: నవరాత్రి సమయంలో ఇంట్లో ఉంచకూడని వస్తువులు!

నవరాత్రి హిందువులందరికీ అత్యంత పవిత్రమైన పండుగ. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవిని వివిధ అవతారాల్లో ఆరాధిస్తారు. ఉపవాసాలు, పూజలు, ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల‌తో ఇల్లు ఆలయ వాతావరణాన్ని సంతరించుకుంటుంది.

Update: 2025-09-11 03:30 GMT

నవరాత్రి హిందువులందరికీ అత్యంత పవిత్రమైన పండుగ. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవిని వివిధ అవతారాల్లో ఆరాధిస్తారు. ఉపవాసాలు, పూజలు, ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల‌తో ఇల్లు ఆలయ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ఈ సందర్భంలో ఇంటి శుభ్రత, పవిత్రత చాలా ముఖ్యం. కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచడం లేదా కొత్తగా కొనడం అశుభంగా పరిగణిస్తారు. అవి ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తాయని విశ్వసిస్తారు. మరి ఆ వస్తువులు ఏమిటో చూద్దాం:

మాంసాహారం, మద్యం: ఈ రోజుల్లో తామసిక ఆహార పదార్థాలైన మాంసం, మద్యం, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటివి పూర్తిగా దూరం పెట్టాలి. ఇవి ఆధ్యాత్మికతను దెబ్బతీసి ప్రతికూల శక్తిని పెంచుతాయని నమ్మకం.

పదునైన వస్తువులు: కత్తులు, కత్తెరలు, సూదులు వంటి పదునైన వస్తువులను కొత్తగా కొనకూడదు. ఇవి ఇంటి వాతావరణంలో కలహాలు, ప్రతికూలతలు పెంచుతాయని విశ్వసిస్తారు.

విరిగిన దేవుని విగ్రహాలు, పాడైన చిత్రాలు: పాడైపోయిన లేదా విరిగిన దేవుని విగ్రహాలు ఇంట్లో ఉండకూడదు. ఇవి నవరాత్రి సమయంలో అశుభ ఫలితాలు ఇస్తాయని చెబుతారు. వీటిని నదిలో నిమజ్జనం చేయడం లేదా శుద్ధమైన స్థలంలో ఉంచడం శ్రేయస్కరం.

తుప్పు పట్టిన ఇనుము వస్తువులు: పాత ఇనుము వస్తువులు, ముఖ్యంగా తుప్పు పట్టినవి, ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయని చెబుతారు. నవరాత్రి రోజుల్లో ఇనుము వస్తువులు కొనరాదు. ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని విశ్వాసం.

లెదర్ వస్తువులు: జంతువుల చర్మంతో తయారయ్యే లెదర్ వస్తువులు పవిత్రతకు విరుద్ధం. పూజా స్థలం దగ్గర బెల్టులు, షూస్, పర్సులు వంటి వస్తువులు ఉంచరాదు. ఈ రోజుల్లో కొత్తగా కొనడమూ మంచిది కాదని చెబుతారు.

పనికిరాని వస్తువులు: ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచడం అత్యంత అవసరం. పాత చెత్త, పనికిరాని వస్తువులను తొలగించడం వల్ల సానుకూల శక్తి ప్రవహిస్తుందని విశ్వాసం.

ఈ నియమాలు కేవలం ఆచారాలు మాత్రమే కాదు, మన జీవన విధానంలో పవిత్రత, క్రమశిక్షణను అలవరచుకోవడానికీ సంకేతాలు. నవరాత్రిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ద్వారా అమ్మవారి ఆశీస్సులు సమృద్ధిగా లభిస్తాయి.

Tags:    

Similar News