Vastu Tips: సాయంత్రం పూట ఈ పనులు చేయకండి – లక్ష్మీదేవి ప్రసన్నంగా ఉండాలంటే పాటించాల్సిన చిట్కాలు
సంపదల దేవతగా భావించే లక్ష్మీదేవిని ఆకర్షించాలంటే మన జీవన విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో కొన్ని పనులు చేయకూడదు అని చెబుతున్నారు. ఎందుకంటే వాటి వల్ల దురదృష్టం, ప్రతికూల శక్తులు మన ఇల్లు చేరుతాయని నమ్మకం ఉంది.

సాయంత్రం నిద్రపోవద్దు – ఈ వేళలో మంచంపై పడుకోవడం శుభం కాదని చెబుతారు.
వంటగది పరిశుభ్రంగా ఉంచాలి – రాత్రి నిద్రించే ముందు వంటగది, పాత్రలు శుభ్రంగా ఉంచడం అదృష్టాన్ని ఆకర్షిస్తుందని వాస్తు చెబుతుంది.
పాత్రలు ఇవ్వకండి – సాయంత్రం సమయంలో వంటపాత్రలు ఎవరికీ ఇవ్వకూడదని అంటారు.
చీపురుతో ఇంటి శుభ్రం వద్దు – ఈ వేళలో ఇంటిని ఊడవడం లక్ష్మీదేవి ఇంట్లో ఉండరని, దురదృష్టాన్ని తెస్తుందని నమ్మకం.
గోర్లు కత్తిరించవద్దు – సాయంత్రం లేదా రాత్రి సమయంలో గోర్లు కత్తిరించడం అశుభమని, ఈ సమయాల్లో లక్ష్మీదేవి ఇల్లు సందర్శిస్తారని చెబుతారు.
తులసి ఆకులు తెంపకండి – సాయంత్రం తులసి ఆకులు తీయడం మంచిది కాదని అంటారు.
గుమ్మం మీద కూర్చోకండి – ఇలా చేస్తే లక్ష్మి దేవి ఇంటికి రారని విశ్వాసం ఉంది.
జుట్టు దువ్వకండి – రాత్రి లేదా సూర్యాస్తమయం తర్వాత జుట్టు దువ్వడం ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుందని చెబుతారు. అలాగే జుట్టు విరబోసుకుని నిద్రపోవడాన్ని కూడా మానుకోవాలి.
రాత్రి ఈల వద్దు – ఇంట్లో రాత్రిపూట ఈల వేయడం ఆర్థిక కష్టాలు, ప్రతికూల శక్తులకు దారితీస్తుందని నమ్మకం.
బ్యాగ్ నేలపై పెట్టకండి – ఇలా చేస్తే డబ్బు ఇంటి నుంచి బయటకు పోతుందని, ఆర్థిక ఇబ్బందులు వస్తాయని చెబుతారు.
ఈ చిన్న చిన్న అలవాట్లు పాటించడం ద్వారా ఇంట్లో శాంతి, సంపదలు నిలవడం, లక్ష్మీ కటాక్షం దక్కుతుందని పండితులు సూచిస్తున్నారు.