Car Discount Offers 2023: ఈ 3 కార్లపై రూ.12 లక్షల వరకు తగ్గింపు.. కారణం ఏంటంటే..?

Car Discount Offers 2023: కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు డిస్కౌంట్‌ ఇస్తున్నారా లేదా పరిశీలిస్తారు.

Update: 2023-12-18 11:07 GMT

Car Discount Offers 2023: ఈ 3 కార్లపై రూ.12 లక్షల వరకు తగ్గింపు.. కారణం ఏంటంటే..?

Car Discount Offers 2023: కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు డిస్కౌంట్‌ ఇస్తున్నారా లేదా పరిశీలిస్తారు. ఒకవేళ కార్ల కంపెనీలు డిస్కౌంట్‌ ప్రకటించినా దాదాపు అది రూ. లక్ష లోపు ఉంటుంది. అంతకంటే ఎక్కువగా డిస్కౌంట్ ఏ కంపెనీ ఇవ్వదు. కానీ డిసెంబర్‌ నెలను దృష్టిలో పెట్టుకుని మూడు కార్లకు ఏకంగా రూ. 12 లక్షల వరకు డిస్కౌంట్‌ ప్రకటించాయి. అయితే ఆ కార్ల ధరలు కూడా ఎక్కువగానే ఉంటాయని గుర్తుంచుకోండి. ఆ మూడు కార్ల గురించి ఈరోజు తెలుసుకుందాం.

మరికొద్ది రోజుల్లో 2024వ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ చివరి రోజులు కార్ల కంపెనీలకు చాలా ముఖ్యమైనవి. ఆటో కంపెనీలు, డీలర్‌షిప్‌లు ఈ రోజుల్లో అమ్ముడుపోని మోడల్‌ల స్టాక్‌ను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాయి. ఇందుకోసం ఆటో బ్రాండ్లు భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తాయి. ప్రస్తుతం కొత్త కారు కొనుగోలుపై రూ. 11.85 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఓవరాల్‌గా మీరు కొత్త కారు కొనాలనుకుంటే ఇది మీకు మంచి అవకాశమని చెప్పాలి.

Jeep Grand Cherokee SUV: జీప్ ప్రధాన SUV గ్రాండ్ చెరోకీ అతిపెద్ద తగ్గింపును పొందుతోంది. ఈ కారును కొనుగోలు చేస్తే మీకు రూ.11.85 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ SUV ఎక్స్-షోరూమ్ ధర రూ. 80,50,000. భారతదేశంలో ఈ మోడల్ పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Volkswagen Tiguan: మీరు వోక్స్‌వ్యాగన్ విలాసవంతమైన SUVని కొనుగోలు చేయాలంటే మీకు భారీ తగ్గింపులు లభిస్తాయి. దీని టాప్ రేంజ్ SUV Tiguan రూ. 4.2 లక్షల వరకు తగ్గింపును పొందుతోంది. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ప్రయోజనాల ద్వారా కంపెనీ ఈ తగ్గింపును అందిస్తుంది. ఇది కాకుండా 4 సంవత్సరాల సర్వీస్ ప్యాకేజీ , ఇతర ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 35.16 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Mahindra XUV400 EV: మీరు ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే మహీంద్రా XUV400ని పరిశీలించవచ్చు. కంపెనీకి చెందిన ఏకైక ఎలక్ట్రిక్ SUV ఇది. దీనిని కొనుగోలు చేస్తే రూ. 4.2 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపు దాని టాప్ వేరియంట్ EL పై అందుబాటులో ఉంటుంది. XUV400 ఎక్స్-షోరూమ్ ధర రూ.15.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Tags:    

Similar News