Best Solo Cars 2026: తక్కువ మెయింటెనెన్స్.. ఫన్ టు డ్రైవ్- సోలో ట్రావెలర్స్‌కు బెస్ట్ కార్లు..!

Best Solo Cars 2026: సోలో ట్రావెలర్స్ రోడ్ ట్రిప్స్, లాంగ్ డ్రైవ్స్ కోసం కారు తీసుకోవాలనుకుంటే హై మైలేజ్, కాంపాక్ట్ సైజ్, కంఫర్ట్, గుడ్ సీటింగ్, AC, ఇన్ఫోటైన్‌మెంట్ , సేఫ్టీ, బూట్ స్పేస్, లో మెయింటెనెన్స్ ముఖ్యం.

Update: 2025-12-31 02:30 GMT

Best Solo Cars 2026: తక్కువ మెయింటెనెన్స్.. ఫన్ టు డ్రైవ్- సోలో ట్రావెలర్స్‌కు బెస్ట్ కార్లు..!

Best Solo Cars 2026: సోలో ట్రావెలర్స్ రోడ్ ట్రిప్స్, లాంగ్ డ్రైవ్స్ కోసం కారు తీసుకోవాలనుకుంటే హై మైలేజ్, కాంపాక్ట్ సైజ్, కంఫర్ట్, గుడ్ సీటింగ్, AC, ఇన్ఫోటైన్‌మెంట్ , సేఫ్టీ, బూట్ స్పేస్, లో మెయింటెనెన్స్ ముఖ్యం. ఒక్కడే డ్రైవ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫన్ టు డ్రైవ్, రిలయబుల్ సర్వీస్ నెట్‌ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. 2025లో ట్రావెలర్స్ కు అనుకూలంగా ఉండే పాపులర్, బెస్ట్ ఆప్షన్లు అయిన హ్యాచ్‌ బ్యాక్, సెడాన్, కాంపాక్ట్ SUVల గురించి తెలుసుకుందాం..

మారుతి సుజుకి స్విఫ్ట్

ఈ హ్యాచ్ బ్యాక్ ధర రూ. 6.5 – రూ.9.5 లక్షలు ఉంటుంది. 22-25 మైలేజ్ ఇస్తుంది. 1.2L పెట్రోల్, టచ్‌స్క్రీన్, క్రూయిజ్ కంట్రోల్, 6 ఎయిర్‌ బ్యాగ్స్, ఫన్ టు డ్రైవ్, సూపర్ మైలేజ్, ఈజీ సిటీ, హైవే ట్రావెల్ కు అనుకూలంగా ఉంటాయి.

మారుతి సుజుకి బాలెనో

ఈ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ధర రూ. 6.7 – రూ. 10 లక్షలు ఉంటుంది. 22-23 మైలేజ్ ఇస్తుంది. హెడ్ అప్ డిస్‌ ప్లే, 360° కెమెరా, సన్‌ రూఫ్, స్పేషియస్ బూట్, ప్రీమియం ఫీల్, హైవే స్టెబిలిటీ అనుగుణంగా ఉంటుంది.

టాటా నెక్సాన్

ఈ కాంపాక్ట్ SUV ధర రూ. 8.0 – 15.5 లక్షలు ఉంటుంది. పెట్రోల్ 17-18 కి.మీ, డీజిల్ 22-24 కి.మీ మైలేజ్ ఇస్తుంది. 5-స్టార్ సేఫ్టీ, వెంటిలేటెడ్ సీట్స్, ADAS సేఫ్టీ టాప్, గ్రౌండ్ క్లియరెన్స్, రఫ్ రోడ్స్ కోసం అనుగుణంగా ఉంటుంది.

హోండా సిటీ

ఈ సెడాన్ ధర రూ. 12 – రూ. 16.5 లక్షలు ఉంటుంది. 18-20 (పెట్రోల్) 26+ (హైబ్రిడ్) మైలేజ్ ఇస్తుంది. స్పేషియస్ క్యాబిన్, స్మూత్ CVT, Honda Sensing ADASఅల్టిమేట్ కంఫర్ట్, హైవే క్రూయిజింగ్, రిఫైన్డ్ డ్రైవ్ అందిస్తుంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా

ఈ కాంపాక్ట్ SUV ధర రూ. 11- రూ. 20 లక్షలు ఉంటుంది. పెట్రోల్ 20-21 కి.మీ, హైబ్రిడ్ 27-28 కి. మీ మైలేజ్ ఇస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్, AWD ఆప్షన్, పనోరమిక్ సన్‌రూఫ్, బెస్ట్ మైలేజ్ (హైబ్రిడ్), SUV పోజిషన్, లాంగ్ ట్రిప్స్ కు అనుగుణంగా ఉంటుంది.

హ్యుందాయ్ క్రెటా

ఈ కాంపాక్ట్ SUV ధర రూ. 11 – రూ. 20 లక్షలు ఉంటుంది. మైలేజ్ 17-21 కి.మీ ఇస్తుంది. పనోరమిక్ సన్‌ రూఫ్, ADAS, వైర్‌ లెస్ చార్జింగ్, ఫీచర్ రిచ్, కంఫర్టబుల్ రైడ్, గుడ్ బూట్ స్పేస్ ను కలిగి ఉంటుంది.

టాటా పంచ్

మైక్రో SUV దీని ధర రూ. 6.- రూ. 10.5 లక్షలు ఉంటుంది. మైలేజ్ 18-20 కి.మీ ఇస్తుంది. 5 స్టార్ సేఫ్టీ, హై గ్రౌండ్ క్లియరెన్స్, CNG ఆప్షన్, బడ్జెట్ ఫ్రెండ్లీ, రఫ్ రోడ్స్, ఈజీ హ్యాండ్లింగ్ కు అనుగుణంగా ఉంటుంది.

Tags:    

Similar News