Car Brake Failure: సడెన్‌గా కారు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి..?
Car Brake Failure: కారు డ్రైవింగ్ చేసేటప్పుడు సడెన్‌గా బ్రేకులు ఫెయిల్ అయితే ఏం చేయాలి.. ఇలాంటి సందర్భంలో చాలామంది గందరగోళానికి గురవుతారు.
Car Brake Failure: సడెన్‌గా కారు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి..?
Car Brake Failure: కారు డ్రైవింగ్ చేసేటప్పుడు సడెన్‌గా బ్రేకులు ఫెయిల్ అయితే ఏం చేయాలి.. ఇలాంటి సందర్భంలో చాలామంది గందరగోళానికి గురవుతారు. ఏం చేయాలో తెలియక ప్రమాదానికి గురవుతారు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ముందుగా ఆందోళన చెందవద్దు. సమయస్ఫూర్తితో ఆలోచించి ప్రమాదాన్ని నివారించవచ్చు. బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ఎలాంటి చిట్కాలు పాటించాలో ఈరోజు తెలుసుకుందాం.
1. హెచ్చరిక లైట్లు ఆన్ చేయాలి
కారు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు చుట్టూ ఉన్న వాహనాలను అప్రమత్తం చేయడానికి హెచ్చరిక లైట్లను ఆన్ చేసి హారన్ కొడుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల రోడ్డుపై ఉండే ఇతర వాహనదారులు కారులో ఉన్న వ్యక్తి సమస్యను ఎదుర్కొంటున్నారని అర్థం చేసుకుంటారు. ఇది చుట్టుపక్కల ట్రాఫిక్‌ను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది.
2. బ్రేక్ పెడల్ తొక్కుతూ ఉండాలి
ఇప్పుడు వచ్చే కొత్త కార్లలో డ్యూయల్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. వీటిద్వారా ముందు, వెనుక బ్రేక్‌లను కంట్రోల్ చేయవచ్చు. బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ముందుగా బ్రేక్ పెడల్‌ను గట్టిగా తొక్కుతూ ఉండాలి. దీనివల్ల బ్రేక్ ప్రెజర్ పెరిగి సగం బ్రేక్‌లు పడే అవకాశం ఉంటుంది. అయితే రెండు బ్రేకింగ్ సిస్టమ్‌లు ఫెయిల్ అయితే ఏం చేయలేము.
3. నెమ్మదిగా డౌన్‌షిఫ్ట్ చేయండి
బ్రేకులు పూర్తిగా ఫెయిల్ అయితే కారు వేగాన్ని తగ్గించడానికి ఇంజిన్ బ్రేకింగ్‌ని ఉపయోగించాలి. ఈ పరిస్థితిలో ఇది సరైన పద్దతి అని చెప్పవచ్చు. యాక్సిలరేటర్‌ని వదిలేసి ఒక్కొక్కటిగా గేర్‌లని తగ్గించాలి.
4. హ్యాండ్‌బ్రేక్‌ని ఉపయోగించాలి
బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు కారును నెమ్మదిగా ఒకటి లేదా రెండవ గేర్‌లోకి తీసుకురావాలి. ఇప్పుడు వేగం 40 kmph కంటే తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో హ్యాండ్‌బ్రేక్‌ని ఉపయోగించవచ్చు. అయితే వెనుక నుంచి ఎటువంటి వాహనం రాకూడదని గుర్తుంచుకోండి.
5. ఇతర చర్యలు
బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు చుట్టుపక్కల ఇసుక లేదా బురద ఉంటే కారును అందులోకి వెళ్లనివ్వాలి. దీనివల్ల కారు వేగం తగ్గిపోయి ఆగిపోతుంది. అయితే ఇలా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.