Nissan Magnite Price Hike: కస్టమర్లకు మరో షాక్ ఇచ్చిన నిస్సాన్.. ఆ కారు ధర భారీగా పెంపు..!
Nissan Magnite Price Hike: నిస్సాన్ మాగ్నైట్ ఒక ఫేమస్ ఎస్‌యూవీ. ఈ కారు డిజైన్, ఫీచర్ల కారణంగా మంచి సంఖ్యలో అమ్ముడవుతోంది.
Nissan Magnite Price Hike: కస్టమర్లకు మరో షాక్ ఇచ్చిన నిస్సాన్.. ఆ కారు ధర భారీగా పెంపు..!
Nissan Magnite Price Hike: నిస్సాన్ మాగ్నైట్ ఒక ఫేమస్ ఎస్‌యూవీ. ఈ కారు డిజైన్, ఫీచర్ల కారణంగా మంచి సంఖ్యలో అమ్ముడవుతోంది. అందుకు నిదర్శనంగా ఈ ఫిబ్రవరిలో 2,328 యూనిట్ల 'నిస్సాన్ మాగ్నైట్' కార్లు అమ్ముడుపోయాయి. ఇప్పుడు ఈ కారు ధర మళ్లీ పెరిగింది. అన్ని వేరియంట్‌లపై రూ.4,000 ధరను పెంచినట్లు కంపెనీ వెల్లడించింది. దాని గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న సరికొత్త నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ ధర రూ.6.14 లక్షల నుండి రూ.11.76 లక్షలు ఎక్స్-షోరూమ్ వరకు ఉంది. ఇది విసియా, విసియా ప్లస్, అసెంటా, ఎన్-కనెక్టా, టెక్నా, టెక్నా ప్లస్ అనే 6 వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
ఈ కారు ఎక్ట్సీరియర్‌లో మరింత ఆకర్షణీయమైన డిజైన్‌లో ఉంటుంది. ఇందులో కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, గ్రిల్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. అలానే 16-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ను కూడా ఉన్నాయి. కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ స్టార్మ్ వైట్, బ్లేడ్ సిల్వర్, సన్‌రైజ్ కూపర్ ఆరెంజ్, ఫ్లేర్ గార్నెట్ రెడ్, ఒనిక్స్ బ్లాక్, పర్ల్ వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.
కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ1- లీటర్ నాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్, సీవీటీ గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. 17.4 నుండి 20 kmpl మైలేజీని ఇస్తుంది.
ఈ కారులో 5 మంది ప్రయాణించవచ్చు. వారాంతాల్లో, సెలవు దినాల్లో ఎక్కువ లగేజీని తీసుకువెళ్లడానికి 336-లీటర్ సామర్థ్యం గల బూట్ స్పేస్ ఉంది. 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో సహా వివిధ ఫీచర్లతో వస్తుంది. భద్రత విషయంలో 6-ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ప్రయాణీకుల రక్షణ కోసం 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి.