Honda Cars Price Hike: కస్టమర్లకు హోండా షాక్.. ఈ కార్ల ధరలు భారీగా పెంపు..!
Honda Cars Price Hike: హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (HCIL) ధరల పెంపునకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
Honda Cars Price Hike: కస్టమర్లకు హోండా షాక్.. ఈ కార్ల ధరలు భారీగా పెంపు..!
Honda Cars Price Hike: హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (HCIL) ధరల పెంపునకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీకి చెందిన అన్ని ప్యాసింజర్ కార్ల ధరలను జనవరి 2026 నుండి పెంచనున్నట్లు ప్రకటించింది. వార్షిక ధర సవరణలో భాగం, ఇప్పటికే ఇతర ఆటోమొబైల్ కంపెనీలు అయిన మారుతి సుజుకి, హ్యుందాయ్, నిసాన్ పెంపును ప్రకటించాయి. ఈ నేపథ్యంలో హోండా కార్స్ కూడా ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. అయితే, ఈ పెంపు 2026 మోడల్ ఇయర్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. పాత స్టాక్ (2025 మోడల్స్) పాత ధరలకే అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. డిసెంబర్ 2025లో కొనుగోలు చేస్తే.. 2025 మోడల్స్ పాత ధరలకే లభిస్తాయి. డీలర్లు డిస్కౌంట్లు, ఆఫర్లు ఇవ్వవచ్చు. ఈ పెంపు కస్టమర్లపై తక్కువ ప్రభావం చూపించడానికి హోండా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ఇతర బ్రాండ్లలో కూడా ఇలాంటి పెంపులు ఉన్నాయి.
పెంచిన ధరలను జనవరి 1, 2026 నుంచి అమలు చేయనున్నట్లు తెలిపింది. ఎంత శాతం ధరలను పెంచుతుందనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ, ఆటో నిపుణుల అంచనాల ప్రకారం 1-2% వరకు ఉండవచ్చని తెలుస్తోంది. మోడల్, వేరియంట్ పై ఆధారపడి ఉంటుంది. అంటే రూ. 10 లక్షల విలువైన కారుకు సుమారు రూ. 10,000- రూ.20,000 వరకు పెరిగే అవకాశం ఉంది.
తమ కార్ల ధరల పెంపునకు సంబంధించి హోండా కీలక ప్రకటన చేసింది. ఇన్ పుట్ కాస్ట్.. షీట్ మెటల్, ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్స్ లాంటి మెటీరియల్స్ ధర పెరగడం వల్లే కార్ల ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. లాజిస్టిక్స్, ఎనర్జీ ధరలు పెరగడం, కమాడిటీ ధరలు, సప్లయర్ ఖర్చులు పెరగడం కారణంగా ధరల పెంపు అనివార్యం అయినట్లు వెల్లడించింది. కార్లకు సంబంధించి ధర తప్ప ఏ మార్పులు లేవని తెలిపింది.
హోండా అమేజ్
ఈ కారు ధర ప్రస్తుతం రూ.7.01 – 10 లక్షల వరకు ఉంది. సుమారు రూ. 7,000 – రూ. 20,000 వరకు ధర పెరిగే అవకాశం ఉంది.
హోండా సిటీ
ప్రస్తుతం ఈ కారు ధర రూ. 11.95 – రూ.16 లక్షలు ఉంటుంది. ఈ మోడల్ పై సుమారు రూ. 12,000 – రూ.32,000 వరకు పెరిగే అవకాశం ఉంది.
హోండా సిటీ హైబ్రిడ్
ఈ కారు ధర రూ. 19.48 – రూ. 20 లక్షలు ఉంటుంది. ఈ కారుపై రూ. 19,000 – రూ. 40,000 పెరిగే అవకాశం ఉంది.
హోండా ఎలివేట్
ఈ కారు ధర రూ. 11 – రూ.16.67 లక్షలు ఉంటుంది. ఈ కారు మీద రూ. 11,000 నుంచి రూ. 33,000 పెరిగే అవకాశం ఉంది.