Buying New Car: కొత్త కారు కొంటున్నారా.. ఏ పార్ట్స్‌కి వారంటీ ఉంటుంది.. ఏ పార్ట్స్‌కి ఉండదు..?

Buying New Car: కొత్త కారు కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మోసానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Update: 2023-08-30 16:00 GMT

Buying New Car: కొత్త కారు కొంటున్నారా.. ఏ పార్ట్స్‌కి వారంటీ ఉంటుంది.. ఏ పార్ట్స్‌కి ఉండదు..?

Buying New Car: కొత్త కారు కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మోసానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే డీలర్లు మీకు తప్పుడు విషయాలు చెప్పి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు. కారు కొనేటప్పుడు కారు పార్ట్స్‌కి సంబంధించి వేటికి వారంటీ ఉంటుందో వేటికి వారంటీ ఉండదో ముందుగానే తెలుసుకోవాలి. లేదంటే భవిష్యత్‌లో నష్టపోయే ప్రమాదం ఉంది. కంపెనీ బ్యాటరీకి వారంటీ ఇస్తుందా లేదా.. టైర్ వారంటీ ఉందా లేదా.. ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

కార్ కంపెనీలు బ్యాటరీ వారంటీ ఇస్తాయా?

ఈ ప్రశ్న చాలా మంది కస్టమర్ల మదిలో మెదులుతూ ఉంటుంది. అయితే కొన్ని కంపెనీలు ఇస్తాయి మరికొన్ని కంపెనీలు ఇవ్వవు. టాటా మోటార్స్ కారును కొనుగోలు చేసినట్లయితే బ్యాటరీపై 18 నెలల వారంటీ అందిస్తారు.

టైర్లకి వారంటీ లభిస్తుందా?

కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు కొన్ని పార్ట్స్‌కి వారంటీ ఇస్తారు. అలాగే కొన్నిటికి ఇవ్వరు. అయితే కారు టైర్లపై ఎలాంటి వారంటీ ప్రయోజనం ఉండదు. ఏ కంపెనీ టైర్లపై వారంటీని అందించదు.

హ్యుందాయ్ వారంటీ

హ్యుందాయ్ నుంచి కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటే ఇంజిన్, ట్రాన్స్‌మిషన్‌పై 60 నెలలు / 1,00,000 కిలోమీటర్ల వారంటీ అందుబాటులో ఉంది. ఇది మాత్రమే కాకుండా కంపెనీ 24 నెలలు/40,000 కిమీల బ్యాటరీ వారంటీని అందిస్తుంది.

షోరూమ్‌కి వెళ్లినప్పుడు ఈ ప్రశ్నలు అడగండి..?

టాటా మోటార్స్ లేదా హ్యుందాయ్ కాకుండా ఇతర కార్ కంపెనీ షోరూమ్‌లకి వెళ్లినప్పుడు కొన్ని ప్రశ్నలు అడగండి. బ్యాటరీ, ఇతర విడి భాగాలపై వారంటీ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుంది. కారులో ఏదైనా పార్ట్ చెడిపోతే దాని వారంటీ వ్యవధిలో సులభంగా మార్చుకోవచ్చు.

Tags:    

Similar News