Pulsar 220F: బజాజ్ పల్సర్ 220F.. కొనేముందు ఇవి తెలుసుకోండి..!
Pulsar 220F: భారత మోటార్‌సైకిల్ మార్కెట్‌లో బజాజ్ పల్సర్ 220Fకి ఉన్న పేరే వేరు. 2009లో మార్కెట్‌లోకి వచ్చిన ఈ బైక్, ఇప్పటివరకు లక్షలాది మంది రైడర్ల నమ్మకాన్ని గెలుచుకుంది.
Pulsar 220F: బజాజ్ పల్సర్ 220F.. కొనేముందు ఇవి తెలుసుకోండి..!
Pulsar 220F: భారత మోటార్‌సైకిల్ మార్కెట్‌లో బజాజ్ పల్సర్ 220Fకి ఉన్న పేరే వేరు. 2009లో మార్కెట్‌లోకి వచ్చిన ఈ బైక్, ఇప్పటివరకు లక్షలాది మంది రైడర్ల నమ్మకాన్ని గెలుచుకుంది. స్పోర్టీ లుక్, శక్తిమంతమైన ఇంజిన్, నమ్మదగిన పనితీరుతో ఇది ఒక లెజెండరీ మోడల్‌గా నిలిచింది. అమ్మకాల ఊపు తగ్గకూడదన్న ఉద్దేశంతో బజాజ్ సంస్థ, అసలు ఫార్ములాను మార్చకుండా చిన్న చిన్న అప్‌డేట్స్ మాత్రమే ఇస్తూ వస్తోంది.
పేరులో ఉన్నట్లుగానే పల్సర్ 220Fలో 220 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 20.9 హెచ్‌పీ శక్తి, 18.5 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. హైవే రైడింగ్, ఓవర్‌టేకింగ్‌లలో ఈ ఇంజిన్ ఇప్పటికీ మంచి విశ్వాసాన్ని ఇస్తుంది. పల్సర్ 220Fలో 15 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. దీనివల్ల తరచుగా పెట్రోల్ బంక్ వద్ద ఆగాల్సిన అవసరం తగ్గుతుంది. బైక్ కర్బ్ వెయిట్ (ఫ్యూయల్, ఇతర ఆయిల్స్‌తో కలిపి) 160 కిలోలు. ఈ వెయిట్ హైవేల్లో స్టేబిలిటీని పెంచుతుంది, అయితే కొత్త రైడర్లకు సిటీ ట్రాఫిక్‌లో కొంచెం భారంగా అనిపించొచ్చు.
ఇటీవల బజాజ్ పల్సర్ 220Fకు రెండు కొత్త కలర్ ఆప్షన్లు ఇచ్చింది, అవి - బ్లాక్ కాపర్ బేజ్, గ్రీన్ లైట్ కాపర్. ఈ రంగులతో పాటు రిఫ్రెష్ చేసిన గ్రాఫిక్స్, LED టర్న్ ఇండికేటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి బైక్‌కు కొంచెం మోడ్రన్ టచ్ ఇస్తున్నాయి. బజాజ్ పల్సర్ 220Fలో ముందు టైర్ – 90/90 – 17 & వెనుక టైర్ – 120/80 – 17 డైమెన్షన్స్‌లో ఉంటాయి. ట్యూబ్‌లెస్ టైర్లు ఇచ్చారు. ఈ సెటప్ హైవేలో మంచి గ్రిప్, స్థిరత్వాన్ని ఇస్తుంది. పల్సర్ 220F మోటార్ సైకిల్ ఆధునిక ఫీచర్లతో నిండిన కొత్త తరం వెహికల్ కాకపోయినా... నమ్మకమైన ఇంజిన్, స్పోర్టీ లుక్, హైవే పనితీరు కోరుకునేవారికి ఇప్పటికీ ఒక మంచి ఎంపిక. కాలం పరీక్షించిన మోడల్ కావడంతో, రీలయబిలిటీపై సందేహం అవసరం లేదు.