Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం (మార్చి 2 - మార్చి 8)
Weekly Horoscope in Telugu 2025 March 2 to March 8: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.
Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం (మార్చి 2 - మార్చి 8)
Weekly Horoscope in Telugu 2025 March 2 to March 8: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.
మేషం
పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కాస్తంత కష్టపడితే చాలు లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆర్థికంగానూ వృద్ధి చెందుతారు. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. దాయాదులు అనుకూలంగా మారతారు. తోడబుట్టిన వారి సమస్య పరిష్కారం అవుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల కలయిక కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ప్రయాణాలు సఫలం అవుతాయి. సాహసోపేతపైన కార్యాలు శుభ ఫలితాలనిస్తాయి. గౌరవం పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. నోటి దురుసును తగ్గించుకోండి.
పరిహారం: శ్రీగౌరీమాతను పూజించండి. ముదురు పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.
వృషభం
పనులు అనుకున్న రీతిలోనే సాగుతాయి. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభ వర్తమానం అందుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఆకాంక్ష నెరవేర్చుకునేందుకు చక్కటి అవకాశాలు లభిస్తాయి. విద్యాభివృద్ధికి అనుకూలం. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. అదృష్టం వరిస్తుంది. వీలైనంతమేర దూర ప్రయాణాలు వాయిదా వేయండి. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. బ్యాంకు లావాదేవీలు కూడా చికాకు పెడతాయి. అనవర విషయాల్లో జోక్యం వద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
పరిహారం: శ్రీ కనకదుర్గ అమ్మవారిని పూజించండి. ఎర్రటి రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.
మిథునం
అభీష్టం నెరవేరుతుంది. కార్యాలన్నీ విజయవంతం అవుతాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. రుణ విముక్తి ప్రయత్నం అనుకూలిస్తుంది. శుభ కార్యాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణానికి సంబంధించిన ఆలోచన చేస్తారు. మిత్రుల ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త బంధాలు ఏర్పడతాయి. సంతాన సంబంధ సౌఖ్యాన్ని పొందుతారు. పెద్దల ఆశీస్సులను పొందుతారు. మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది. కీలక సమయంలో అదృష్టం తోడుగా నిలుస్తుంది. ఆత్మీయుల వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. బద్ధకం వదిలిపెట్టాలి.
పరిహారం: శ్రీ గాయత్రీమాతను పూజించండి. కుంకుమ రంగు కలిసిన దుస్తులను ధరించండి.
కర్కాటకం
తలపెట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. మనసులోని కోరిక తీరుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లోని వారికి మేలైన అవకాశాలు అందివస్తాయి. అధికారుల ప్రశంసలను పొందుతారు. ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొడతారు. అధికార వృద్ధి ఉంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. కొత్త స్నేహాలు లాభసాటిగా ఉంటాయి. తండ్రి సామాజిక స్థితి మెరుగ్గా ఉంటుంది. గృహ నిర్మాణ యత్నాలు కొలిక్కి వస్తాయి. ఒంటరితనాన్ని కోరుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త.
పరిహారం: శ్రీ ఆంజనేయ స్వామిని పూజించండి. సిందూరపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.
సింహం
పట్టింది బంగారంలా ఉంటుంది. ప్రయత్నించిన ప్రతి కార్యం సఫలం అవుతుంది. ఆర్థికంగా మెరుగ్గా ఉంటారు. ఇతరులతో విరోధం ఏర్పడినా మీదే పైచేయిగా ఉంటుంది. అధికారుల అభిమానాన్ని పొందుతారు. చక్కటి అవకాశాలను సొంతం చేసుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేస్తున్న పనిలో స్థిరత్వం ఏర్పడుతుంది. కొత్త పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. గౌరవం వృద్ధి చెందుతుంది. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భవిష్యత్ ప్రణాళికలను రూపొందిస్తారు.
పరిహారం: శ్రీవేంకటేశ్వర స్వామిని పూజించండి. లేత పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.
కన్య
ఉద్యోగపరమైన విషయాలు తృప్తినిస్తాయి. ఇష్ట కార్యం అనుకూలమవుతుంది. ఇతరత్రా ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఉన్నత పదవిలోని వారి ప్రశంసలు లభిస్తాయి. సమర్థతకు తగ్గ గుర్తింపు ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. చెడు ఆలోచనలను నియంత్రించండి. తగాదాలకు ఆస్కారం ఉంది. నోటిని అదుపులో ఉంచుకోండి. అనవసర విషయాల్లో జోక్యం వల్ల మనశ్శాంతి ఉండదు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అజీర్తి సమస్య ఉంటుంది.
పరిహారం: శ్రీలక్ష్మీనృసింహ స్వామిని పూజించండి. ముదురు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించండి.
తుల
వ్యాపార రంగంలోని వారికి శుభ ఫలితాలుంటాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ప్రయాణం లాభిస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. జీవిత భాగస్వామితో అనుబంధ బలపడుతుంది. సంతాన సంబంధ విషయాలు తృప్తినిస్తాయి. కోపాన్ని అదుపు చేసుకోండి. ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. చెప్పుడు మాటలను విశ్వసించడం వల్ల ఇతరులపై అపోహలు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం వద్దు. మనశ్శాంతి కరువవుతుంది.
పరిహారం: శ్రీ సూర్యభగవానుడిని పూజించండి. నారింజ రంగు కలిసిన దుస్తులను ధరించండి.
వృశ్చికం
అన్ని పనులూ శుభప్రంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటారు. వివాదాలు తొలగిపోతాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. అదృష్టం కూడా తోడుంటుంది. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. సంతాన సంబంధ విషయాలు ఆనందాన్నిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. పోయిన వస్తువు తిరిగి దొరుకుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. కీళ్ల సమస్య ఉంటుంది.
పరిహారం: శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని పూజించండి. పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.
ధనుస్సు
వ్యవహారాలన్నీ విజయవంతంగా సాగుతాయి. ధనలాభం ఉంది. ఉద్యోగ వ్యవహారాల్లో సంతృప్తి లభిస్తుంది. పోటీల్లో విజేతలుగా నిలుస్తారు. మిత్రుల తోడ్పాటు లభిస్తుంది. బలహీనతలను అధిగమిస్తారు. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అపోహలు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. సంతానం తీరు చికాకు పెడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. విలువైన వస్తువులు జాగ్రత్త.
పరిహారం: శ్రీదత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. తెల్లటి వస్త్రాలను ధరించండి.
మకరం
పనుల్లో ఆశించిన ఫలితాన్ని పొందుతారు. ధనలాభం ఉంది. బంధువులు సహకరిస్తారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. కీలక అడ్డంకిని అధిగమించి పోటీలో విజేతగా నిలుస్తారు. న్యాయ వివాదాలు అనుకూలంగా సాగుతాయి. స్థిరాస్తి లావాదేవీల్లో నష్టం గోచరిస్తోంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. బుద్ధి నిలకడ లేమి వల్ల ఆత్మీయులతోనే గొడవపడే సూచన ఉంది. సంతాన సంబంధ విషయాలు చికాకు పెడతాయి. మనశ్శాంతి ఉండదు. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. వృథా ఖర్చులుంటాయి. వాత సంబంధ సమస్య ఉంటుంది.
పరిహారం: శ్రీశివపార్వతులను పూజించండి. గోధుమ రంగు కలిసిన దుస్తులను ధరించండి.
కుంభం
వ్యవహార జయం ఉంది. ధనాదాయం పెరుగుతుంది. నూతన వస్త్రాభరణాలను కొంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆత్మీయులతో సంభాషణ నూతన ఉత్తేజాన్నిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాయకత్వ పటిమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. సహచరులు సహకరిస్తారు. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. కీలకమైన సమాచారం అందుతుంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. మనసును అదుపులో ఉంచుకోవాలి. గొడవలకు దూరంగా ఉండాలి. ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. బద్ధకాన్ని వదిలిపెట్టాలి. వృథా ఖర్చు తగ్గించాలి.
పరిహారం: నవగ్రహాలను దర్శించి పూజించండి. నీలం రంగు కలిసిన దుస్తులను ధరించండి.
మీనం
వ్యవహారాల్లో మేలిమి ఫలితాలుంటాయి. ఆదాయం పెరుగుతుంది. అన్ని వైపుల నుంచీ సహకారం అందుతుంది. సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారు. నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తారు. అధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు. సోదరుల వ్యవహారాలను చక్కదిద్దుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆధ్యాత్మిక అంశాల ద్వారా ప్రేరణను పొందుతారు. బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్త. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. ఎవరికీ పూచీకత్తుగా ఉండకండి. మాట తప్పడం వల్ల అవమానం ఎదురవుతుంది.
పరిహారం: శ్రీదక్షిణామూర్తిని ఆరాధించండి. తెల్లటి వస్త్రాలను ధరించండి.