Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం (ఫిబ్రవరి 9 - ఫిబ్రవరి 15)

Weekly Horoscope in Telugu, 2025 February 9 to February 15: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.

Update: 2025-02-08 21:48 GMT

Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం (ఫిబ్రవరి 9 - ఫిబ్రవరి 15)

Weekly Horoscope in Telugu, 2025 February 9 to February 15: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.

మేషం

ఆశించిన ప్రయోజనం సిద్ధిస్తుంది. ధనాదాయం ఉంది. సాహసోపేతమైన నిర్ణయం మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. మిత్రులు సహకరిస్తారు. కీలక సమయంలో మీలోని నాయకత్వ లక్షణాలు ఉపకరిస్తాయి. సొంత ఆలోచనలు మేలు. సోదరుల వ్యవహారాలను చక్కదిద్దుతారు. ఆధ్యాత్మిక అంశాల నుంచి ప్రేరణను పొందుతారు. బంధువుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. చెప్పుడు మాటలను విశ్వసించకండి. సంతాన వ్యవహారాలు కలవర పెడతాయి. స్థిరాస్తి లావాదేవీలు లాభించవు. విలువైన వస్తువులు జాగ్రత్త.

పరిహారం: శ్రీలక్ష్మీసహిత నారాయణుని పూజించండి. లేత ఆకుపచ్చ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

వృషభం 

చిత్తశుద్ధితో చేపట్టే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. ధనలాభం ఉంది. నూతన వస్త్రాభరణాలు కొంటారు. ఆత్మీయులతో సంభాషణ నూతన ఉత్తేజాన్నిస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. సేవకులు, తోటి ఉద్యోగుల తోడ్పాటుతో కీలక వ్యవహారంలో సఫలం అవుతారు. ప్రయాణం లాభిస్తుంది. వారం మధ్యలో అందే సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్త. మోసపోయే సూచన ఉంది. ఎవరికీ పూచీగా ఉండకండి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. మంచి ఆలోచనల వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

పరిహారం: శ్రీసూర్య భగవానుడిని పూజించండి. నారింజ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

మిథునం 

అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో విశేష లాభం ఉంది. అదృష్టం కూడా తోడుంటుంది. మీ వ్యక్తిత్వానికి తోడు సాహసోపేతమైన నిర్ణయాలు మిమ్మల్ని విజేతగా నిలబెడతాయి. జీవితంలో ఉన్నత స్థానానికి చేరే ప్రయత్నం అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. ఉద్యోగులు రివార్డులను పొందుతారు. తోబుట్టువుల అండతో కుటుంబ సమస్యలను పరిష్కరిస్తారు. జన్మస్థలాన్ని సందర్శిస్తారు. అనవసరం వ్యవహారాల్లో జోక్యం వద్దు. రెండో పెళ్లి ప్రయత్నం అనుకూలించదు. కంటి సమస్య వుంటుంది.

పరిహారం: శ్రీ వేంకటేశ్వరస్వామిని పూజించండి. లేత పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

కర్కాటకం

వ్యవహారాలు ఆశించిన రీతిలోనే సాగుతాయి. విశిష్ట వ్యక్తిత్వంతో పెద్దల ఆదరాన్ని పొందుతారు. అవసరానికి సరిపడినంత డబ్బు సమకూరుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. గౌరవం పెరుగుతుంది. ఎదిగేందుకు చేసే యత్నాలకు మిత్రులు సహకరిస్తారు. మనోధైర్యం పెరుగుగుంది. ఆరోగ్యం బావుంటుంది. కోర్టు కేసుల్ని నిర్లక్ష్యం చేస్తే భారీగా నష్టపోయే సూచన ఉంది. దూర ప్రయాణం గోచరిస్తోంది. విదేశీ ప్రయాణ యత్నాలకు అనుకూలంగా ఉంది. విడాకుల వ్యవహారం కొలిక్కి రాదు. ఇతరుల విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి.

పరిహారం: శ్రీగౌరీదేవిని పూజించండి. కుంకుమ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

సింహం 

శుభప్రదంగా ఉంటుంది. ఆకాంక్షలు తీరడంతో ఆనందం పెరుగుతుంది. రుణ విముక్తి యత్నాలు ఫలిస్తాయి. కొత్త స్నేహాలు లాభసాటిగా ఉంటాయి. ఇష్టమైన వారితో విందుకు హాజరవుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. శారీరక, మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. సంతాన సంబంధ శుభకార్యాచరణపై చర్చిస్తారు. సొంతింటి ఆలోచన కొలిక్కి వస్తుంది. బాల్యస్నేహితులతో వినోదంగా గడుపుతారు. కీర్తి పెరుగుతుంది. భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలు వేస్తారు. దూర ప్రయాణం గోచరిస్తోంది. అనవసర జోక్యాలు వద్దు.

పరిహారం: శ్రీశనైశ్చరుడికి తైలాభిషేకం చేయండి. లేత నీలపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

కన్య

అత్యంత యోగదాయకంగా ఉంటుంది. అన్నింటా అనుకూల ఫలితాలే ఉంటాయి. జీవితంలో ఎదిగేందుకు అవసరమైన మేలిమి అవకాశాలు అందివస్తాయి. సద్వినియోగం చేసుకోండి. ప్రత్యర్థులపై మీదే పైచేయిగా ఉంటుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగుల సమర్థతకు తగ్గ గుర్గింపు లభిస్తుంది. నూతన పరిచయాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. విందులకు హాజరవుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మనశ్శాంతి ఉంటుంది. అనవసర ప్రయాణాలు మానండి.

పరిహారం: శ్రీదత్తాత్రేయ స్వామిని పూజించండి. తెల్లటి రంగు దుస్తులను ధరించండి.

తుల 

ఇష్టకార్యం అనూకూలంగా సాగుతుంది. స్థిరచిత్తంతో చేసే ప్రతి పనీ విజయవంతం అవుతుంది. శ్రమకు తగ్గట్లే అవకాశాలూ కలిసివస్తాయి. ప్రణాళికాబద్ధంగా ఎదిగేందుకు ఇది మంచి సమయం. ఉన్నత స్థానాల్లోని వారు మీకు సహకరిస్తారు. వృత్తిపరమైన నైపుణ్యంతో, ఉద్యోగులు మేలిమి అవకాశాలను పొందుతారు. పోటీల్లో విజేతలుగా నిలుస్తారు.ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాలు గౌరవాన్ని పెంచుతాయి. బంధువులతో విందులకు హాజరవుతారు. సంప్రదాయాలపై ఆసక్తి ఏర్పడుతుంది.

పరిహారం: శ్రీగణపతిని పూజించండి. గోధుమ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

వృశ్చికం 

ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. ఉద్యోగులకు అధికారుల ఆశీస్సులు లభిస్తాయి. నిపుణతకు తగ్గ గుర్తింపు ఉంటుంది. అధికార వృద్ధి గోచరిస్తోంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. దూర ప్రాంతంలో స్థిరనివాసం గురించి ఆలోచిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండి. ముఖ్యంగా ఇతరుల విషయాల్లో జోక్యం మంచిది కాదు. పోటీలకు దూరంగా ఉండండి. ఇతరులపై చెడు ఆలోచనలు ఏర్పడతాయి. అజీర్తి సమస్య వేధిస్తుంది.

పరిహారం: శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని పూజించండి. పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

ధనుస్సు 

ప్రయత్నం ఫలిస్తుంది. ధనలాభం ఉంది. బంధు, మిత్రులను కలుసుకుంటారు. ఇతరులతోనూ మంచి సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణం ఆనందాన్నిస్తుంది. స్వేచ్ఛాజీవితాన్ని కోరుకుంటారు. బంధువులను కలుస్తారు. కొత్త విషయాలు తెలుస్తాయి. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. సంతాన సంబంధ విషయాలు తృప్తినిస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. వారం ద్వితీయార్థంలో కాస్త ప్రతికూలత ఉంటుంది. ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. తగాదాలకు ఆస్కారం వుంది. ఆరోగ్యం జాగ్రత్త.

పరిహారం: నవగ్రహాలను దర్శించి ప్రదక్షిణలు చేయండి. ఊదారంగు కలిసిన దుస్తులను ధరించండి.

మకరం 

వ్యవహారాలన్నింటా శుభ ఫలితాలు అందుతాయి. చిక్కులు తొలగిపోతాయి. ఆర్థికంగా బలపడతారు. బంధుమిత్రులు సహకరిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యవహారాల్లో విశేష లాభాలుంటాయి. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. నూతన వస్తుప్రాప్తి ఉంది.పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. స్వేచ్ఛాజీవితాన్ని కోరుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. తగాదాలు వద్దు. చెప్పుడు మాటలు వినకండి. చెడు ఆలోచనలను మానండి. కీళ్ల సమస్య వుంటుంది.

పరిహారం: శ్రీ గాయత్రీమాతను పూజించండి. మెరూన్ రెడ్ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

కుంభం 

యోగదాయకంగా ఉంటుంది. ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నూతన వస్తువులు, ఆభరణాలను కొంటారు. సందేహాలు నివృత్తి అవుతాయి. మనసు ఉల్లాసంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సూచనలు బాగా ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. విందులకు హాజరవుతారు. కొత్త బంధాలు బలపడతాయి. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. విజ్ఞానాన్ని పెంచుకునే యత్నం చేస్తారు.

మిత్రులు సహకరిస్తారు. గొడవలకు దిగకండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మనశ్శాంతి వుంటుంది.

పరిహారం: శ్రీ కనకదుర్గమ్మను పూజించండి. ముదురు ఆకుపచ్చ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

మీనం 

వ్యవహారాలు సవ్యంగానే సాగుతాయి. అవసరమైన డబ్బు చేతికి అందుతుంది. వివాదాలు సమసిపోతాయి. పోటీల్లో విజేతలుగా నిలుస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బలహీనతలను జయిస్తారు. బంధుమిత్రులు సహకరిస్తారు. విందులో పాల్గొంటారు. ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. రహస్య జీవితం గురించిన గుట్టు రట్టవుతుంది. సంతాన సంబంధ వ్యవహారాలు చికాకు పెడతాయి. బద్ధకం వల్ల ఇబ్బంది పడతారు. స్థిరాస్తి వ్యవహారాలు లాభించవు. అవమానం గోచరిస్తోంది. కడుపు లోపలి భాగం వల్ల ఇబ్బంది పడతారు.

పరిహారం: శ్రీ పరమశివుడిని పూజించండి. భస్మపు రంగు కలిసిన దుస్తులను ధరించండి. 

Tags:    

Similar News