Venus Transit 2025: శుక్రుడు గమనాన్ని మార్చుకోనున్నాడు.. అదృష్టం, డబ్బుతో మెరిసే మూడు రాశులు
వేద జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు సంపద, సౌఖ్యం, కళ, ప్రేమ, వైభవానికి ప్రతీకగా పరిగణించబడతాడు. శుక్రుని గమనంలో మార్పు ప్రతి ఒక్కరి జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అక్టోబర్ 9న శుక్రుడు తన గమనాన్ని మార్చుకొని బుధుడు అధిపత్యం వహించే కన్యా రాశిలో ప్రవేశించనున్నాడు.
Venus Transit 2025: శుక్రుడు గమనాన్ని మార్చుకోనున్నాడు.. అదృష్టం, డబ్బుతో మెరిసే మూడు రాశులు
వేద జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు సంపద, సౌఖ్యం, కళ, ప్రేమ, వైభవానికి ప్రతీకగా పరిగణించబడతాడు. శుక్రుని గమనంలో మార్పు ప్రతి ఒక్కరి జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అక్టోబర్ 9న శుక్రుడు తన గమనాన్ని మార్చుకొని బుధుడు అధిపత్యం వహించే కన్యా రాశిలో ప్రవేశించనున్నాడు. శుక్ర–బుధుల స్నేహబంధం కారణంగా ఈ సంచారం అన్ని రాశులకూ శుభప్రదంగానే ఉంటుంది. ముఖ్యంగా మూడు రాశులకు ఇది అదృష్టం, సంపద, పురోగతిని అందించబోతోంది.
వృశ్చిక రాశి
వృశ్చికరాశివారికి శుక్ర సంచారం అత్యంత శుభప్రదం. కొత్తగా డబ్బు సంపాదించే మార్గాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. గతంలో ఎదురైన అడ్డంకులు తొలగి పనులు సాఫీగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశం ఉంటుంది. వ్యాపారవేత్తలకు లాభదాయక సమయం. స్వయం కృషితో గౌరవం, ధనం రెండూ పొందుతారు.
సింహ రాశి
సింహరాశివారికి ఈ సంచారం ఒక వరప్రసాదం లాంటిది. అనుకోని ఆర్థిక లాభాలు కలుగుతాయి. బాకీలు, వసూళ్లు రావచ్చు. ఆఫీసులో పనికి గుర్తింపు లభించి పదోన్నతులు రావచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు.
ధనుస్సు రాశి
ధనుస్సురాశివారికి శుక్ర సంచారం కొత్త విజయాలను అందిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం రెండింట్లోనూ అద్భుత ఫలితాలు పొందుతారు. కొత్త పనులు మొదలుపెట్టడానికి ఇది శుభసమయం. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. వివాహ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. స్వయం కృషితో మంచి ఆదాయాన్ని పొందుతారు.
గమనిక: ఈ వివరాలు జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా మాత్రమే. శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తి కోసం అందించబడింది.