Vastu Tips: బుద్ధుడి విగ్రహం ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?
Vastu Tips: తరచుగా ప్రజలు తమ ఇళ్లలో బుద్ధుని పెద్ద విగ్రహాలను ఉంచుకుంటారు. బుద్ధుడి విగ్రహం కేవలం ఇంటి అలంకరణ మాత్రమే కాదు. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
Vastu Tips: బుద్ధుడి విగ్రహం ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?
Vastu Tips: తరచుగా ప్రజలు తమ ఇళ్లలో బుద్ధుని పెద్ద విగ్రహాలను ఉంచుకుంటారు. బుద్ధుడి విగ్రహం కేవలం ఇంటి అలంకరణ మాత్రమే కాదు. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాస్తు శాస్త్రంలో బుద్దుని విగ్రహంకు సంబంధించి ప్రత్యేక నియమాలు ఉన్నాయి. వాస్తు ప్రకారం, బుద్దుని విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలి? బుద్ధుని విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం ద్వారా ఏలాంటి ఫలితాలు ఉంటాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
* వాస్తు ప్రకారం, ఇంట్లో బుద్ధుని విగ్రహం ఉండటం చాలా శుభప్రదం. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నెలకొంటాయి.
* బుద్ధుని విగ్రహాన్ని సరైన దిశలో ఉంచడం కూడా చాలా ముఖ్యం. అప్పుడే శుభ ఫలితాలు లభిస్తాయి. బుద్ధుని విగ్రహాన్ని ఇంట్లో తూర్పు దిశ వైపు ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు.
* ఇంట్లో బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ లేదా వ్యతిరేక శక్తులు ఇంట్లోకి రావడం తగ్గుతుంది. ఇది శాంతిని, సానుకూలతను కలిగించడంలో సహాయపడుతుంది.
* ఇల్లు ప్రశాంతంగా, పాజిటివ్ ఎనర్జీతో ఉండాలంటే బుద్ధుని విగ్రహం ప్రవేశద్వారం దగ్గర లేదా హాల్‌లో ఉంచటం మంచిది. ఇది చెడు శక్తులను దూరంగా ఉంచుతుంది.
* ఇంట్లో గౌతమ బుద్ధుని విగ్రహం ఉంచడం వలన మనస్సుకు శాంతి కలుగుతుంది. మనలోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే, మంచి వాతావరణం ఏర్పడుతుంది.
* బుద్ధుడి విగ్రహం ముందు ధ్యానం చేస్తే మన ఏకాగ్రత కూడా పెరుగుతుంది. విద్యార్థులు, ఉద్యోగస్తులు దీనివల్ల లాభపడతారు.