Vastu Tips For Week: సోమవారం నుంచి ఆదివారం వరకూ.. ఈ 7 పనులు నిషేధం!
Vastu Tips For Week: రోజువారీ జీవితంలో వాస్తు చిట్కాలు ఇంటిలో సానుకూల శక్తిని, శ్రేయస్సును పెంచడానికి సహాయపడతాయి.
Vastu Tips For Week: సోమవారం నుంచి ఆదివారం వరకూ.. ఈ 7 పనులు నిషేధం!
Vastu Tips For Week: రోజువారీ జీవితంలో వాస్తు చిట్కాలు ఇంటిలో సానుకూల శక్తిని, శ్రేయస్సును పెంచడానికి సహాయపడతాయి. ఇంట్లో ముఖ్యంగా ప్రధాన ద్వారం, పడకగది, వంటగది, పూజ గది వంటి వాటిని వాస్తు ప్రకారం ఉంచడం మంచిది. అలాగే, ఇంట్లో శుభ్రత పాటించడం కూడా చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. అయితే, సోమవారం నుండి ఆదివారం వరకు.. వారంలో 7 రోజులు ఈ పనులను చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, వారంలోని 7 రోజులు నివారించాల్సిన పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సోమవారం
వాస్తు శాస్త్రం ప్రకారం, సోమవారం పొరపాటున కూడా నల్ల దుస్తులు ధరించకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు, ఈ రోజున నలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది కాదని, తెల్లని వస్త్రాలు ధరించడం శ్రేయస్కరమని సూచిస్తున్నారు. ఎందుకంటే, నలుపు రంగు ప్రతికూలతను సూచిస్తుంది, కాబట్టి సోమవారం నాడు నల్ల దుస్తులు ధరించకూడదు.
మంగళవారం
మంగళవారం నాడు, చట్టపరమైన విషయాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి, పొరపాటున కూడా ఈ విషయాల్లో జోక్యం చేసుకోకూడదని చెబుతున్నారు. అలా కాకుండా చర్యలు తీసుకుంటే ఓటమి తప్పదంటున్నారు.
బుధవారం
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, బుధవారం నాడు అప్పు తీసుకోవడం మంచిది కాదని, అది ఆర్థిక సమస్యలకు దారి తీస్తుందని నమ్ముతారు. బుధవారం అప్పు తీసుకుంటే, ఆ అప్పును తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవుతాయని నమ్మకం అయితే, కొందరు బుధవారం అప్పు ఇవ్వడం కూడా మంచిది కాదని చెబుతారు. కాబట్టి, బుధవారం ఎవరి నుండి అప్పు తీసుకోకండి.
గురువారం
గురువారం నాడు గోర్లు, జుట్టు కత్తిరించకూడదు. ఇది హిందూ సాంప్రదాయాల ప్రకారం అశుభంగా భావిస్తారు. గురువారం లక్ష్మీదేవికి సంబంధించిన రోజుగా పరిగణిస్తారు. కాబట్టి ఆ రోజున జుట్టు లేదా గోర్లు కత్తిరించడం లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుందని నమ్ముతారు. గురువారం నాడు జుట్టు కత్తిరించడం లేదా గోర్లు కత్తిరించడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయని చెబుతున్నారు.
శుక్రవారం
వాస్తు శాస్త్రం ప్రకారం, శుక్రవారం నాడు ఏ దేవాలయంలోనైనా బంగారం లేదా వెండిని దానం చేయకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
శనివారం
వాస్తు శాస్త్రం ప్రకారం, శనివారం ఇనుప వస్తువులు, కత్తెరలు లేదా ఇతర ఇనుపతో చేసిన వస్తువులను కొనవద్దని పెద్దలు చెబుతారు. ఇది శని గ్రహానికి సంబంధించినదని నమ్మకం. శనివారం శని దేవుడికి ప్రీతికరమైన రోజు, కాబట్టి ఈ రోజున ఇనుప వస్తువులు కొనడం మంచిది కాదని నమ్ముతారు. బదులుగా, శనివారం నాడు ఇనుము దానం చేయడం శ్రేయస్కరం అని అంటున్నారు.
ఆదివారం
వాస్తు శాస్త్రం ప్రకారం, ఆదివారం పొరపాటున కూడా తులసిని పూజించకూడదు.ఆదివారం నాడు తులసిని పూజించడం లేదా ఆకులు కోయడం వంటివి చేయకూడదని శాస్త్రాలలో చెప్పబడింది. ఆదివారం తులసి దేవి విశ్రాంతి తీసుకుంటుందని, ఆ రోజున పూజలు, ఆకులు కోయడం వంటివి చేయడం మంచిది కాదని నమ్ముతారు.