Vastu Tips: ఈ వస్తువులను ఫ్రీగా తీసుకుంటే.. దురదృష్టాన్ని వెంట పెట్టుకున్నట్లే..!
Vastu Tips: సాధారణంగా చాలా మంది స్నేహితులు, బంధువులు, పొరుగువారి నుండి కొన్ని వస్తువులను ఫ్రీగా లేదా అప్పుగా తీసుకుంటారు. అయితే, పొరపాటున కూడా కొన్ని వస్తువులను ఇతరుల నుండి ఉచితంగా తీసుకోకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
Vastu Tips: ఈ వస్తువులను ఫ్రీగా తీసుకుంటే.. దురదృష్టాన్ని వెంట పెట్టుకున్నట్లే..!
Vastu Tips: సాధారణంగా చాలా మంది స్నేహితులు, బంధువులు, పొరుగువారి నుండి కొన్ని వస్తువులను ఫ్రీగా లేదా అప్పుగా తీసుకుంటారు. అయితే, పొరపాటున కూడా కొన్ని వస్తువులను ఇతరుల నుండి ఉచితంగా తీసుకోకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మనం ఇతరుల నుండి ఈ వస్తువులను తీసుకుంటే అది అనారోగ్యం, ఆర్థిక నష్టంతో సహా అనేక సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు. కాబట్టి, ఇతరుల నుండి ఏ వస్తువులను ఫ్రీగా తీసుకోవడం మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం..
బట్టలు:
బట్టలు ప్రతికూల శక్తిని కలిగి ఉంటాయి. మీరు వేరొకరి బట్టలు ధరిస్తే, ఆ వ్యక్తికి ఉన్న ప్రతికూల శక్తి మీకు వ్యాపించే అవకాశం ఉంది. మరొక కారణం ఏమిటంటే, వారికి అలెర్జీలు వంటి సమస్యలు ఉంటే, ఆ బట్టల ద్వారా సమస్య మీకు వచ్చే అవకాశం ఉంది.
వాచ్:
ఒక వ్యక్తి అదృష్టం అతని వాచ్ మీద ఆధారపడి ఉంటుందని అంటారు. వాచ్ కేవలం సమయాన్ని మాత్రమే కాకుండా అతని మంచి, చెడు సమయాలను కూడా తెలియజేస్తుంది. కాబట్టి, ఎప్పుడూ మరొకరి వ్యక్తి వాచ్ ధరించకూడదు. ఎందుకంటే, ఇది వారి ప్రతికూల శక్తిని మీకు వ్యాపింపజేస్తుంది.
చెప్పులు:
కొంతమంది ఇతరుల బూట్లు, చెప్పులు ధరించడానికి ఇష్టపడతారు. అయితే, ఇతరుల బూట్లు లేదా చెప్పులు ధరించడం మంచిది కాదు. అలాగే వాటిని ఇతరుల నుండి ఉచితంగా కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది పనిలో అడ్డంకులు సహా కొన్ని సమస్యలకు దారితీస్తుందని చెబుతారు.
హ్యాండ్ కర్చీఫ్:
శాస్త్రాల ప్రకారం, ఇతరుల నుండి హ్యాండ్ కర్చీఫ్ ఫ్రీగా తీసుకోవడం మంచిది కాదు. అలాగే వీటిని బహుమతిగా కూడా ఇవ్వకూడదు. దీనివల్ల గొడవలు, ఉద్రిక్తత, ఆర్థిక నష్టం వంటి సమస్యలు వస్తాయి.
ఉప్పు:
ఉప్పును సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. అయితే, మీరు దానిని ఇతరుల నుండి ఉచితంగా స్వీకరిస్తే అది మీ ఇంట్లోకి ప్రతికూల శక్తిని వ్యాపింపజేస్తుంది. ఉప్పును ఉచితంగా స్వీకరించడం వల్ల అప్పులు సహా ఆర్థిక సమస్యలు వస్తాయి.
పెన్ను:
పెన్ను ఎట్టిపరిస్థితిలోనూ ఫ్రీగా తీసుకోకూడదు. ఎందుకంటే, పెట్టుబడికి సంబంధించిన విషయాలలో ఆర్థిక నష్టం సంభవించవచ్చు. కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లోనూ వేరొకరి పెన్నును ఉపయోగించవద్దు.
డబ్బు:
ఎవరి దగ్గరా అప్పు తీసుకోకండి. అత్యవసర పరిస్థితిలో మీకు డబ్బు అవసరమైతే రుణం తీసుకున్న తర్వాత వీలైనంత త్వరగా తిరిగి ఇవ్వండి. లేకుంటే అది మీకు దురదృష్టాన్ని తెస్తుంది. ఇతరుల డబ్బును దుర్వినియోగం చేయడం వేదాలలో ప్రతికూలతకు సంకేతంగా పరిగణించబడుతుంది.