Vastu Tips: అదృష్టం రావాలంటే.. ఈ 5 వస్తువులను మీ ఇంట్లో ఉంచండి
Vastu Tips: మన చుట్టూ ఉన్న వాతావరణం మన మనసుపై, ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. కాబట్టి, ఇంట్లో శుభ్రతతో పాటు శక్తిని ఇచ్చే వస్తువులను పెట్టుకోవడం వల్ల మనం ప్రశాంతంగా, ఆనందంగా ఉండగలుగుతాం.
Vastu Tips: అదృష్టం రావాలంటే.. ఈ 5 వస్తువులను మీ ఇంట్లో ఉంచండి
Vastu Tips: మన చుట్టూ ఉన్న వాతావరణం మన మనసుపై, ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. కాబట్టి, ఇంట్లో శుభ్రతతో పాటు శక్తిని ఇచ్చే వస్తువులను పెట్టుకోవడం వల్ల మనం ప్రశాంతంగా, ఆనందంగా ఉండగలుగుతాం. ఫెంగ్ షుయ్ అనే చైనీస్ శాస్త్రం ప్రకారం, కొన్ని ప్రత్యేక వస్తువులు మన ఇంట్లో ఉంచితే, ఆ శక్తి మరింత బలంగా మారుతుంది. అలాంటి కొన్ని ముఖ్యమైన వస్తువుల గురించి తెలుసుకుందాం..
లాఫింగ్ బుద్ధా
ఇంట్లో నవ్వుతున్న బుద్ధుడి విగ్రహాన్ని పెట్టడం వల్ల ఆనందం, ప్రశాంతత, ఐశ్వర్యం వస్తాయని నమ్ముతారు. ముఖ్యంగా కుటుంబ కలహాలు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. బుద్ధుడి విగ్రహం వెనుక గోడ ఉండేలా చూసుకోవాలి. పైగా ఎవరైనా బహుమతిగా ఇచ్చిన బుద్ధుడికి శక్తి మరింతగా పెరుగుతుందని కూడా చెబుతారు.
వెదురు చెట్టు
ఇంట్లో పచ్చదనం ఉంటే మంచి శక్తి ఉంటుంది. వెదురు చెట్టు ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం అదృష్టాన్ని కూడా ఆకర్షిస్తుంది. ఇది గాలిని శుద్ధి చేస్తుంది. మీరు దీనిని హాలులో లేదా అందరూ కూర్చునే ప్రదేశంలో ఉంచితే మంచిది.
మనీ ప్లాంట్
ఇది ఇంట్లో మంచి శక్తిని తీసుకురావడంతో పాటు గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. మనీ ప్లాంట్‌ను బాల్కనీలో లేదా కిచెన్ దగ్గర పెట్టుకోవచ్చు. ఇది ఇంట్లో ఉంటే ఆర్థికంగా ఎదగడానికి సహాయపడుతుందని నమ్మకం.
డ్రాగన్ విగ్రహం లేదా చిత్రం
డ్రాగన్‌ను ఫెంగ్ షుయ్‌లో శక్తి, ఆరోగ్యం, సాహసానికి ప్రతీకగా భావిస్తారు. ఇంట్లో డ్రాగన్ చిత్రం లేదా విగ్రహాన్ని ఉంచితే సానుకూల శక్తి కలుగుతుంది. దాన్ని ఇంటికి ముఖంగా ఉంచితే బాగుంటుంది.
గుర్రపు విగ్రహం
విజయం, పురోగతికి గుర్రం ప్రతీక. ఇంట్లో గుర్రపు విగ్రహం ఉంచితే ఉత్సాహం, విజయం, ఆరోగ్యం అన్నీ మెరుగవుతాయని చెబుతారు. ముఖ్యంగా కార్యాలయం లేదా చదువుకునే ప్రదేశంలో ఉంచితే మంచిది.
ఈ వస్తువులు ఇంట్లో పెట్టడం వల్ల మీ చుట్టూ సానుకూల శక్తి ఏర్పడి, మనశ్శాంతి, ఆరోగ్యం, అభివృద్ధి ఉంటుంది. వాటిని పెట్టేటప్పుడు శుభ్రమైన ప్రదేశాల్లో, సరైన దిశలో ఉంచడం మరింత మంచిది.