Vastu Tips For Shoe: జాగ్రత్త.. ఈ రంగు బూట్లు, చెప్పులు వేసుకుంటే పేదరికం వెంటాడుతుంది ..!
Vastu Tips For Shoe: వాస్తు శాస్త్రం ప్రకారం అనేక విషయాలు మన జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపుతాయి. వీటిలో బూట్లు, చెప్పులు కూడా ఉన్నాయి. వాస్తు ప్రకారం బూట్లు, చెప్పులు మన విధిని కూడా ప్రభావితం చేస్తాయి.
Vastu Tips For Shoe: జాగ్రత్త.. ఈ రంగు బూట్లు, చెప్పులు వేసుకుంటే పేదరికం వెంటాడుతుంది ..!
Vastu Tips For Shoe: వాస్తు శాస్త్రం ప్రకారం అనేక విషయాలు మన జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపుతాయి. వీటిలో బూట్లు, చెప్పులు కూడా ఉన్నాయి. వాస్తు ప్రకారం బూట్లు, చెప్పులు మన విధిని కూడా ప్రభావితం చేస్తాయి. ఈ రోజు మనం బూట్లకు గ్రహాలతో సంబంధం ఏమిటి? వాస్తు ప్రకారం మనం ఏ రంగు బూట్లు, చెప్పులు వేసుకుంటే మంచిది? ఏ రంగు బూట్లు వేసుకోకూడదు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
జ్యోతిషశాస్త్రంలో పాదాలను మీన రాశికి సంబంధించినవిగా భావిస్తారు. అదే సమయంలో శని, రాహు గ్రహాలు కూడా పాదాలపై, వాటికి సంబంధించిన విషయాలపై ప్రభావం చూపుతాయి. ఒక వ్యక్తి బూట్లు లేదా చెప్పులు ధరించినప్పుడు, ఈ గ్రహాలు చురుకుగా మారతాయి. వాటి వాడకంలో నిర్లక్ష్యంగా ఉంటే ఆరోగ్యం, గౌరవం, ఆర్థిక స్థితిని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే బూట్లు సరిగ్గా ఉపయోగించడం ముఖ్యమని అంటారు.
ఏ రంగు బూట్లు ధరించకూడదు?
మీ జాతకంలో బుధుడు బలమైన స్థితిలో ఉంటే ఆకుపచ్చ బూట్లు ధరించడం మానుకోండి. కుజుడు ఆధిపత్యంలో ఉంటే ఎరుపు రంగు బూట్లు వాడటం మానేయడం మంచిది. పసుపు రంగు బూట్లు, చెప్పులు అస్సలు ధరించవద్దు. ఈ రంగు జ్ఞానం, శుభాన్ని సూచించే బృహస్పతి గ్రహంతో ముడిపడి ఉంది. దీన్ని పాదాలకు ధరించడం అశుభమని నమ్ముతారు. జీవితంలో అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు కలిగితాయని భావిస్తారు.
ఈ విషయాలను గుర్తుంచుకోండి
* బూట్లు, చెప్పులు ధరించే ముందు వాటిని శుభ్రం చేసుకోండి. ఎందుకంటే దుమ్ము లేదా మురికి బూట్లు ధరించడం మంచిది కాదు. వాటిని ఎలా పడితే అలా వదలకండి. ఎప్పుడూ స్థిరమైన, శుభ్రమైన ప్లేస్‌లో ఉంచండి.
* వంటగది లేదా ప్రార్థనా స్థలం దగ్గర బూట్లు, చెప్పులు ఉంచడం అశుభం.
* మంచం దగ్గర చెప్పులు పెట్టుకునే అలవాటు మానసిక అశాంతిని కలిగిస్తుంది.
* ఇంట్లో స్థిరత్వం, సానుకూల శక్తిని కాపాడుకోవడానికి బూట్ల కోసం శుభ్రమైన స్థలాన్ని కేటాయించండి.
* తెలుపు రంగు అన్ని రంగుల సమతుల్యత అని అంటారు. తెల్లటి బూట్లు, చెప్పులు అందరికీ అనుకూలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఏ గ్రహంపైనా ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపవని అంటున్నారు. ఎరుపు, ఆకుపచ్చ, గులాబీ లేదా ఊదా రంగు బూట్లు వీలైనంత తక్కువగా ధరించాలని సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ పసుపు రంగు బూట్లను వేసుకోకూడదని హెచ్చరిస్తున్నారు.