Vastu Tips For Painting: లక్ష్మీ కటాక్షం కావాలా.. ఈ దిశలో పెయింటింగ్స్ ఉంచండి
Vastu Tips For Painting: వాస్తు ప్రకారం, ఇంట్లో ఈ దిశలో పెయింటింగ్స్ ఉంచడం చాలా శుభపద్రం. ఈ దిశలో కొన్ని రకాల పెయింటింగ్స్ పెట్టడం వల్ల ఇంట్లో అష్టైశ్వార్యాలు లభిస్తాయి.
Vastu Tips For Painting: లక్ష్మీ కటాక్షం కావాలా.. ఈ దిశలో పెయింటింగ్స్ ఉంచండి
Vastu Tips For Painting: వాస్తు ప్రకారం, ఇంట్లో ఈ దిశలో పెయింటింగ్స్ ఉంచడం చాలా శుభపద్రం. ఈ దిశలో కొన్ని రకాల పెయింటింగ్స్ పెట్టడం వల్ల ఇంట్లో అష్టైశ్వార్యాలు లభిస్తాయి. కాబట్టి, మీ ఇంటికి మీరు పెయింటింగ్స్ ఎంచుకునేటప్పుడు, వాస్తు ప్రకారం సరిపోయే పెయింటింగ్స్ ఎంచుకోవడం మంచిది. పెయింటింగ్స్ ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ఉండటం మాత్రమే కాకుండా సంతోషకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు. పెయింటింగ్స్ ను సరైన దిశలో పెట్టడం వల్ల లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుంది.
వాస్తు ప్రకారం, దక్షిణ దిశలో మనీ ప్లాంట్ లేదా లక్ష్మీ దేవికి సంబంధించిన పెయింటింగ్ పెట్టాలి.
ఇది ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. డబ్బు కొరత లేకుండా చేస్తుంది. ఇంట్లో అర్థిక సమస్యలు తొలగిపోతాయి.
ఉత్తర దిశలో పచ్చని చెట్లు లేదా పువ్వులు ఉన్న పెయింటింగ్ ఉంచండి. ఇవి కెరీర్‌లో విజయాన్ని, ఉద్యోగంలో పురోగతిని తీసుకొస్తాయి. అంతేకాకుండా, ఇంట్లో సానుకూల శక్తి పెరిగి, ఆనందం నెలకొంటుంది.
కుటుంబం నిలకడగా ఉండాలంటే నైరుతి దిశలో కుటుంబ ఫోటో పెట్టండి. దీని వల్ల కుటుంబం మధ్య బంధాలు బలపడతాయి. స్థిరమైన ఆదాయం, ఆర్థిక భద్రత కూడా లభిస్తుంది.
పశ్చిమ దిశలో ఎత్తైన భవనాల చిత్రం ఉంచండి. ఇది సంపదను ఆకర్షిస్తుంది. అంతేకాకుండా, ఉద్యోగం లేని వారికి ఇది మంచి అవకాశాలు తెస్తుంది.
ఇంట్లో ఉన్న పెయింటింగ్‌లు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోండి. పగిలిన చిత్రాలు ఇంట్లో ఉంచడం అశుభం. అవి వాస్తు దోషాలు వచ్చేలా చేస్తాయి. కాబట్టి, అలాంటి వాటిని ఇంట్లో ఉంచకండి.