Vastu Tips: రాత్రిపూట ఈ 4 పనులు అస్సలు చేయకండి!

వాస్తు శాస్త్రం ప్రకారం, రాత్రిపూట చెత్త పారవేయడం, గొడవపడటం, పాదాలు కడుక్కోకుండా నిద్రపోవడం, అప్పుగా డబ్బు ఇవ్వడం దురదృష్టాన్ని తెస్తాయని చెబుతారు. రాత్రిపూట మానుకోవలసిన ఈ 4 పనుల వివరాలు చదవండి.

Update: 2025-05-22 12:58 GMT

Vastu Tips: రాత్రిపూట ఈ 4 పనులు అస్సలు చేయకండి!

వాస్తు ప్రకారం రాత్రిపూట చేయరాని నాలుగు పనులు

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం, రాత్రిపూట కొన్ని పనులు చేయడం అశుభంగా భావిస్తారు. మానసిక, శారీరక సమస్యలతో పాటు ఆర్థికంగా కూడా దురదృష్టం వెంటాడవచ్చని నమ్మకం. అలాంటి ముఖ్యమైన నాలుగు పనులే ఇవి:

1. చెత్తను ఊడ్చడం లేదా పారవేయడం

సూర్యాస్తమయం అనంతరం ఇంటి చెత్తను ఊడ్చి బయట వేయడం మంచిదికాదు. ఇది లక్ష్మీ దేవిని ఇంటి నుంచి పంపించడమేనని పురాణాలు చెబుతున్నాయి. ఈ పని ఆర్థిక నష్టానికి దారితీస్తుందని విశ్వాసం.

2. నిద్రపోయే ముందు గొడవపడటం

రాత్రి గొడవలు మనశ్శాంతిని భంగం చేస్తాయి. నిద్రలేమి, ఒత్తిడితోపాటు కుటుంబంలో దురభిమానాలు పెరుగుతాయి. ఇది ప్రతికూల శక్తులకు తలుపులు తెరిచినట్లే.

3. పాదాలు కడుక్కోకుండా నిద్రపోవడం

పురాతన గ్రంథాలు, ఆయుర్వేదం ప్రకారం పడుకునే ముందు పాదాలు కడుక్కోవడం మంచిది. బయట నుండి వచ్చిన ధూళి, ప్రతికూల శక్తిని తొలగించేందుకు ఇది అవసరం.

4. అప్పుగా డబ్బు లేదా వస్తువులివ్వడం

రాత్రిపూట డబ్బు అప్పుగా ఇవ్వడం దురదృష్టకరం. ఇది సంపద పోవడాన్ని సూచిస్తుంది. ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశముంది.

ఈ సూచనలు పాటించడం వల్ల ఇంట్లో శాంతి, సంతోషం స్థిరంగా ఉండే అవకాశం ఉంది.

Tags:    

Similar News