Vastu Tips: ఇంట్లో కంప్యూటర్ ఏ దిశలో ఉండాలి.? వాస్తు ఏం చెబుతోంది..
Vastu Tips: ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరి ఇంట్లో కంప్యూటర్ వినియోగం అనివార్యంగా మారింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరగడం, విద్యార్థులు కూడా ల్యాప్‌టాప్‌లు ఉపయోగిస్తుండడంతో అందరి ఇళ్లలో సిస్టమ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు.
Vastu Tips: ఇంట్లో కంప్యూటర్ ఏ దిశలో ఉండాలి.? వాస్తు ఏం చెబుతోంది..
Vastu Tips: ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరి ఇంట్లో కంప్యూటర్ వినియోగం అనివార్యంగా మారింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరగడం, విద్యార్థులు కూడా ల్యాప్‌టాప్‌లు ఉపయోగిస్తుండడంతో అందరి ఇళ్లలో సిస్టమ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఇంట్లో కంప్యూటర్‌ను ఏ దిశలో పెట్టుకోవాలన్న విషయంలో చాలా మందికి సరైన క్లారిటీ ఉండదు.
అయితే కంప్యూటర్ విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడుతాయని నిపుణులు అంటున్నారు. ఇంట్లో కంప్యూటర్‌ను సరైన దిశలో ఏర్పాటు చేయకపోతే కుటుంబంలో ప్రతికూల ప్రభావాలు ఏర్పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
కంప్యూటర్ ఏ దిశలో ఉండాలి ?
వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంట్లో కంప్యూటర్‌ను దక్షిణ లేదా పడమర దిశలో ఉంచడం మంచిది. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తిని తగ్గించి, సానుకూల శక్తిని పెంచుతుంది. కంప్యూటర్ మీద పనిచేసే వ్యక్తి ముఖం కొద్దిగా కుడివైపుకు ఉండేలా చూసుకోవాలి.
కంప్యూటర్ టేబుల్‌పై తాజా పూలు, మొక్కలు ఉండేలా చూసుకోవాలి. ఇది సానుకూల వాతావరణాన్ని పెంచుతుంది. అయితే ప్లాస్టిక్ పూలు పెట్టడం మంచిది కాదు. తూర్పు-పడమర దిశలో కంప్యూటర్‌ను ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఇది వాస్తు దోషానికి కారణమవుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి వస్తువుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వాస్తులో పేర్కొన్న విధంగా వస్తువులను ఉంచితే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. అన్ని వస్తువులకు వాస్తును పాటించినట్లే కంప్యూటర్ విషయంలో కూడా వాస్తు నియమాలు పాటించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.