Zodiac Wise Saraswati Mantras: వసంత పంచమి స్పెషల్.. మీ రాశి ప్రకారం ఏ మంత్రం పఠించాలి? సరస్వతీ దేవి అనుగ్రహం కోసం ఇలా చేయండి!
Zodiac Wise Saraswati Mantras: వసంత పంచమి 2026: మీ రాశి ప్రకారం ఏ మంత్రాన్ని పఠిస్తే సరస్వతీ దేవి అనుగ్రహం కలుగుతుందో తెలుసుకోండి. చదువులో రాణించాలన్నా, కెరీర్‌లో విజయం సాధించాలన్నా ఈ రాశి మంత్రాలు తప్పక చదవండి.
Zodiac Wise Saraswati Mantras: వసంత పంచమి స్పెషల్.. మీ రాశి ప్రకారం ఏ మంత్రం పఠించాలి? సరస్వతీ దేవి అనుగ్రహం కోసం ఇలా చేయండి!
Zodiac Wise Saraswati Mantras: మాఘ మాసంలో వచ్చే పవిత్ర పండుగ వసంత పంచమి. దీనిని 'శ్రీ పంచమి' అని కూడా పిలుస్తారు. జ్ఞానానికి, విద్యకు అధిదేవత అయిన సరస్వతీ దేవి జన్మించిన రోజు కావడంతో, ఈ రోజు అక్షరాభ్యాసాలకు అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు. అయితే, కేవలం పిల్లలే కాదు.. పెద్దలు కూడా తమ రాశి ప్రకారం కొన్ని ప్రత్యేక మంత్రాలను పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.
ద్వాదశ రాశుల వారు పఠించాల్సిన మంత్రాలు ఇవే:
మేష రాశి: 'ఓం ఐం సరస్వతీ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. పరీక్షల్లో విజయం, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది.
వృషభ రాశి: పసుపు రంగు దుస్తులు ధరించి 'ఓం హ్రీం సరస్వతీ నమః' పఠించండి. కళలు, సంగీత రంగాల్లో రాణిస్తారు.
మిధున రాశి: ఆకుపచ్చ దుస్తులు ధరించి 'ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యై నమః' పఠించండి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది.
కర్కాటక రాశి: తూర్పు ముఖంగా కూర్చుని 'ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై సరస్వత్యై నమః' పఠించండి. మనశ్శాంతి లభిస్తుంది.
సింహ రాశి: 'ఓం హ్రం హ్రీం హ్రూ సహ్ సూర్య సరస్వత్యై నమః' మంత్రాన్ని పఠించండి. నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి.
కన్యా రాశి: ఉత్తర దిశలో కూర్చుని 'ఓం బుం బుద్ధయే సరస్వత్యై నమః' పఠించండి. ఉద్యోగ, వ్యాపారాల్లో తెలివితేటలు పెరుగుతాయి.
తులా రాశి: తెలుపు లేదా నీలం దుస్తులు ధరించి 'ఓం శుక్రాయ సరస్వతీ నమః' పఠించండి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
వృశ్చిక రాశి: ఎరుపు రంగు వస్త్రాలు ధరించి 'ఓం అంగారకాయ సరస్వతీ నమః' పఠించండి. ధైర్యం, శత్రువులపై విజయం లభిస్తుంది.
ధనుస్సు రాశి: 'ఓం బృహస్పతయే సరస్వత్యై నమః' పఠించండి. ఆధ్యాత్మిక జ్ఞానం మరియు విజయం వరిస్తుంది.
మకర రాశి: పశ్చిమ ముఖంగా కూర్చుని 'ఓం శ్యం శనిశ్చరాయ సరస్వత్యై నమః' పఠించండి. కెరీర్‌లో స్థిరత్వం ఏర్పడుతుంది.
కుంభ రాశి: 'ఓం శ్యం శనిశ్చరాయ సరస్వత్యై నమః' మంత్రాన్ని పఠించండి. కొత్త ఆలోచనలు సఫలమై సాంకేతిక రంగంలో రాణిస్తారు.
మీన రాశి: 'ఓం బృహస్పతయే సరస్వత్యై నమః' మంత్రం పఠించండి. సృజనాత్మకత పెరిగి ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది.
గమనిక: ఈ సమాచారం కేవలం మతపరమైన విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని పాటించే ముందు వ్యక్తిగత నిర్ణయం ముఖ్యం.