Today Horoscope: ఈ రోజు రాశి ఫలితాలు – జూన్ 27, 2025
ఈ రోజు రాశి ఫలితాలు – జూన్ 27, 2025
Today Horoscope: ఈ రోజు రాశి ఫలితాలు – జూన్ 27, 2025
గ్రహయోగాలు: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం
తిథి: శుక్ల ద్వితీయ ప.1.22 వరకు, అనంతరం తృతీయ
నక్షత్రం: పునర్వసు ప.9.47 వరకు, అనంతరం పుష్యమి
వర్జ్యం: సాయంత్రం 5.41 నుండి 7.16 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 8.07–8.59, మధ్యాహ్నం 12.26–1.18
అమృతఘడియలు: ఉదయం 7.25–8.57
రాహుకాలం: ఉదయం 10.30–12.00
యమగండం: మధ్యాహ్నం 3.00–4.30
సూర్యోదయం: 5.31
సూర్యాస్తమయం: 6.34
మేషం
పనుల్లో అడ్డంకులు రావచ్చు. అప్పులు అవసరం కావచ్చు. అనూహ్య ప్రయాణాలు చేస్తారు. ఇంటి సమస్యలు చికాకులు కలిగించవచ్చు. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక దృష్టితో సమయం గడిపితే శాంతి లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సాధారణ ఫలితాలు.
వృషభం
శుభకార్యాల చర్చలు జరగవచ్చు. బాకీలు వసూలవుతాయి. బాల్యమిత్రులతో కలిసే అవకాశం. భూములు, వాహనాల కొనుగోలు సూచనలు. వ్యాపార విస్తరణ. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు.
మిథునం
కుటుంబంలో విభేదాలు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. అప్పులు చేయవలసి రావచ్చు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆలయ దర్శనం, స్థిరాస్తి వృద్ధి. వ్యాపార మందగమనంతోపాటు ఉద్యోగాల్లో ఒత్తిడి.
కర్కాటకం
పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు జరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. వస్తులాభాలు, వ్యాపార పుంజుకోవడం, ఉద్యోగాల్లో అనుకూలత.
సింహం
పనుల్లో ఆటంకాలు, ఖర్చుల పెరుగుదల. ప్రయాణాలు వాయిదా పడే అవకాశముంది. శ్రమ అధికంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు తలెత్తొచ్చు. వ్యాపార లాభాలు తక్కువగా ఉండొచ్చు. ఉద్యోగ మార్పుల సూచనలు.
కన్యా
అప్పులు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రుల ఆహ్వానాలు, సంఘంలో ఆదరణ. విజయవంతమైన పనులు. వ్యాపార ఉత్సాహం. ఉద్యోగాల్లో పదోన్నతి అవకాశాలు.
తుల
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వస్తులాభాలు. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆశ్చర్యకర సంఘటనలు. వ్యాపార లాభాలు. ఉద్యోగాల్లో నూతన ఉత్సాహం.
వృశ్చికం
సన్నిహితులు, మిత్రులతో వివాదాలు. ఆర్థికంగా నిరుత్సాహకర పరిస్థితులు. శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపార మందగమనంతోపాటు ఉద్యోగాల్లో స్వల్ప సమస్యలు.
ధనుస్సు
పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఒత్తిడులు. ప్రయాణ మార్పులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్య సమస్యలు. నిరుద్యోగులకు నిరాశ. సాధారణ వ్యాపార పరిస్థితులు. ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు.
మకరం
ఖ్యాతి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు. మిత్రుల ఆహ్వానాలు. ఆస్తి వివాద పరిష్కారాలు. శుభవార్తలు. వ్యాపార లాభాలు. ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు.
కుంభం
కుటుంబంలో ఉల్లాస వాతావరణం. ఆర్థిక స్థితి మెరుగుదల. సన్నిహితుల సహకారం. వాహనయోగం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపార లాభాలు. ఉద్యోగ ఒత్తిడుల తొలగింపు.
మీనం
సన్నిహితులతో అకారణ వివాదాలు. అకస్మిక ప్రయాణాలు. కుటుంబ ఒత్తిడులు. బంధువులతో కలుసుకునే అవకాశం. వ్యాపార ఇబ్బందులు. ఉద్యోగాల్లో పనిభారం.