Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 25 July 2024
Today Horoscope in Telugu, 25 July 2024: ఈరోజు ఎవరికి ఎలా ఉంటుంది? ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి సమస్యలు పొంచి ఉన్నాయి? ఈ రోజు 12 రాశి ఫలాలపై జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 25 July 2024
Today Horoscope in Telugu, 25 July 2024: ఈరోజు ఎవరికి ఎలా ఉంటుంది? ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి సమస్యలు పొంచి ఉన్నాయి? ఈ రోజు 12 రాశి ఫలాలపై జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, కృష్ణ పక్షం
తిధి: పంచమి ఇవాళ అర్ధరాత్రి దాటాక గం.1.58 ని.ల వరకు ఆ తర్వాత షష్ఠి
నక్షత్రం: పూర్వాభాద్ర సాయంత్రం గం.4.16 ని.ల వరకు ఆ తర్వాత ఉత్తరాభాద్ర
అమృతఘడియలు: ఉదయం గం.8.55 ని.ల నుంచి గం.10.24 ని.ల వరకు
వర్జ్యం: అర్ధరాత్రి గం.1.10 ని.ల నుంచి గం. 2.39 ని.ల వరకు
దుర్ముహూర్తం: ఉదయం గం.10.15 ని.ల నుంచి గం.11.07 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.25 ని.ల నుంచి గం.4.16 ని.ల వరకు
రాహుకాలం: మధ్యాహ్నం గం.2.01 ని.ల నుంచి గం. 3.38 ని.ల వరకు
సూర్యోదయం: తె.వా. గం. 5.58 ని.లకు
సూర్యాస్తమయం: సా. గం.6.51 ని.లకు
మేషం
కార్యాలు అనుకున్నట్లుగా సాగవు. ఆర్థిక లావాదేవీలు ఆలస్యమవుతాయి. శోధనల్లోనే సమయం వృథా వుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. రవాణ వ్యవహారాలు లాభించవు. ప్రయాణాలు వద్దు.
వృషభం
ఆకాంక్ష నెరవేరుతుంది. జీవిత భాగస్వామి తరఫు వారి సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలుంటాయి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. సహచరులతో సయోధ్య ఏర్పడుతుంది.
మిథునం
పోటీలో మీకే విజయం లభిస్తుంది. ఆశించిన ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు. శిక్షణ రంగంలోని వారికి బాగుంటుంది. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. సంతాన సంబంధ షేర్ల వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి.
కర్కాటకం
మధ్యవర్తిత్వాలు పెద్దగా ఫలించవు. తండ్రి ధోరణిని విభేదిస్తారు. బంధువులతోనూ విరోధం ఏర్పడుతుంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. వృథా ప్రయాణాలు చేయకండి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సింహం
వ్యవహారాల్లో నష్టం ఎదురవుతుంది. ఆర్థిక లావాదేవీలు సజావుగా ఉండవు. ఆటంకాలను అధిగమించాలి. నిందలు వస్తాయి. ఉబుసుపోని ప్రయాణాలు సూచిస్తున్నాయి. అంటువ్యాధులు సోకే వీలుంది. జాగ్రత్త.
కన్య
అందరితో కలివిడిగా గడుపుతారు. పోయిన సొత్తు తిరిగి లభించే సూచన ఉంది. మధ్యవర్తుల వల్ల ప్రయోజనాన్ని పొందుతారు. తండ్రి మిత్రులను కలుస్తారు. జననేంద్రియ సమస్యను అశ్రద్ధ చేయకండి.
తుల
పోటీలలో అనుకూల ఫలితాలను పొందుతారు. బ్యాంకు నిల్వలు పెరుగుతాయి. జంతు మూలక ఆనందం పొందుతారు. వేళకు భోజనం ఉండదు. అత్యవసర ప్రయాణం వల్ల జీవిత భాగస్వామికి దూరంగా వెళతారు.
వృశ్చికం
ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు బాగా కష్టపడాల్సి వుంటుంది. జీవిత భాగస్వామి సలహాలు ఉపకరిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. తల్లి ఆస్తి వ్యవహారాలు చికాకు పెడతాయి. చెడు ఆలోచనలను అదుపు చేయండి.
ధనుస్సు
ఆస్తి సంబంధ లావాదేవీలు లాభించవు. విద్యారంగంలోని వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఔషధ సేవనం సూచిస్తోంది.. ఆరోగ్యం జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
మకరం
స్థిరచిత్తంతో పనులు చేయండి. ఆశించిన ఫలితం దక్కుతుంది. మధ్యవర్తిత్వం ఫలిస్తుంది. అభిరుచికి తగ్గ సౌకర్యాలు సమకూరతాయి. బహుమానాలు పొందుతారు. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలుంటాయి.
కుంభం
కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. బ్యాంకులతో లావాదేవీల్లో ఇబ్బంది వస్తుంది. కుటుంబ సభ్యులతో మాట పడాల్సి వస్తుంది. జీవిత భాగస్వామికి ప్రమాద సూచన ఉంది. దాయాదుల వేధింపు పెరుగుతుంది.
మీనం
లక్ష్యం నెరవేరుతుంది. సహచరులకు మార్గనిర్దేశం చేస్తారు. ఇతరుల డబ్బుతో చేసే లావాదేవీలు లాభిస్తాయి. అదృష్టం తోడుంటుంది. గౌరవం పెరుగుతుంది. తమ్ముడికి సంబంధించిన వ్యవహారాలు సఫలమవుతాయి.