Today Horoscope in Telugu, 8 August 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే
Today Horoscope in Telugu 8 August 2024: ఈరోజు రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.
Today Horoscope in Telugu, 8 August 2024
08-08-2024 ( గురువారం )
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, శుక్ల పక్షం.
తిధి : చవితి అర్ధరాత్రి గం.12.36 ని.ల వరకు ఆ తర్వాత పంచమి.
నక్షత్రం: ఉత్తర రాత్రి గం.11.34 ని.ల వరకు ఆ తర్వాత హస్త.
అమృతఘడియలు: మధ్యాహ్నం గం.3.27 ని.ల నుంచి గం.5.15 ని.ల వరకు.
వర్జ్యం: --
దుర్ముహూర్తం : ఉదయం గం.10.14 ని.ల నుంచి గం. 11.05 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.21 ని.ల నుంచి గం.4.12 ని.ల వరకు.
రాహుకాలం : మధ్యాహ్నం గం.1.58 ని.ల నుంచి గం.3.34 ని.ల వరకు.
సూర్యోదయం : తె.వా. గం. 5.57 ని.లకు.
సూర్యాస్తమయం : సా. గం.6.46 ని.లకు.
మేషం
ఆటంకాలుంటాయి. అప్రమత్తంగా అడుగులు వేయాలి. డబ్బుకి సంబంధించిన అంశాలు అసంతృప్తిని కలిగిస్తాయి. అనవసరమైన తగాదాలకు వెళ్లకండి. విలువైన వస్తువులు జాగ్రత్త. వాత సమస్యలుండే వీలుంది.
వృషభం
ఆస్తి అమ్మే ప్రయత్నాలు నష్టదాయకంగా ఉంటాయి. బుద్ధి నిలకడ లోపిస్తుంది. అయినవారితోనే గొడవలకు ఆస్కారం ఉంది. ప్రతి పనిలోనూ అడ్డంకుల వల్ల ఆందోళన పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.
మిథునం
ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆశించిన లక్ష్యాన్ని చేరుకుంటారు. మిత్రుల సహకారం లభిస్తుంది. కీలక సమాచారం సంతృప్తినిస్తుంది. అగ్రిమెంట్లకు అనుకూలం. కుటుంబసౌఖ్యాన్ని పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
కర్కాటకం
బ్యాంకు లావాదేవీలు ఆశించిన రీతిలో సాగవు. అనవసర నిందలు మనసుకి కష్టం కలిగిస్తాయి. అకారణ విరోధాలు గోచరిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండండి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఇంటిపై శ్రద్ధ వహించండి.
సింహం
అనుకున్న రీతిలోనే పనులు సాగుతాయి. డబ్బుకి సంబంధించిన అంశాలు కొలిక్కి వస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. బంధువులతో విందులో పాల్గొంటారు. గౌరవం పెరుగుతుంది. రోజంతా ఉత్సాహంగా గడుపుతారు.
కన్య
కార్యక్రమాలు సజావుగా సాగవు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు బాగా కష్టపడాలి. ధననష్టం గోచరిస్తోంది. ఇతరులతో అప్రమత్తంగా వ్యవహరించండి. ప్రయాణాలు వాయిదా వేయండి. ఆరోగ్యం జాగ్రత్త.
తుల
అభీష్టం నెరవేరుతుంది. ధనలాభం ఉంది. రుణ సంబంధ ప్రయత్నాలు మీరు ఆశించిన రీతిలోనే సాగుతాయి. సంతాన వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. విందులో పాల్గొంటారు. కొత్త స్నేహాలు ఏర్పడతాయి.
వృశ్చికం
స్థిర చిత్తంతో చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. చక్కటి అవకాశాలు అందివస్తాయి. ఉద్యోగుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. శత్రుపీడ తగ్గుతుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. గౌరవం పెరుగుతుంది.
ధనుస్సు
పనులు సవ్యంగా సాగవు. ఆర్థిక లావాదేవీల్లో జాప్యం ఉంటుంది. సంతానం తీరును విభేదిస్తారు. దూర ప్రయాణం గోచరిస్తోంది. ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మకరం
నిర్దేశిత సదుపాయాలు సమకూరవు. స్వల్ప తగాదాలకు ఆస్కారం ఉంది. చెప్పుడు మాటలు వినకండి. అనవసర ఆందోళనతో తప్పు నిర్ణయాలు తీసుకునే వీలుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
కుంభం
ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. ప్రయాణాలు ఆనందకరంగా ఉంటాయి. బంధుమిత్రులను కలుస్తారు. విందులో పాల్గొంటారు.
మీనం
యత్నించిన ప్రతి కార్యమూ సఫలం అవుతుంది. మిత్రులు తోడుగా నిలుస్తారు. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. బలహీనతలను బయట పెట్టకండి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.