Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 02 August 2024
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 02 August 2024
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 02 August 2024
02-08-2024 (శుక్రవారం)
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ రుతువు, కృష్ణ పక్షం
తిధి: త్రయోదశి మధ్యాహ్నం గం.3.26 ని.ల వరకు తర్వాత చతుర్దశి
నక్షత్రం: ఆరుద్ర ఉదయం గం.10.59 ని.ల వరకు ఆ తర్వాత పునర్వసు
అమృతఘడియలు: ..
వర్జ్యం: రాత్రి గం.11.29 ని.ల నుంచి గం.1.09 ని.ల వరకు
దుర్ముహూర్తం : ఉదయం గం.8.30 ని.ల నుంచి గం. 9.22 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.48 ని.ల నుంచి గం. 1.40 ని.ల వరకు
రాహుకాలం : ఉదయం గం.10.46 ని.ల నుంచి గం. 12.22 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా. గం. 5.56 ని.లకు
సూర్యాస్తమయం : సా. గం.6.49 ని.లకు
మేషం
శుభదాయకంగా ఉంటుంది. ఆదాయం మెరుగవుతుంది. కనిష్ట సోదరుల గురించిన శుభవార్త వింటారు. అనూహ్య ప్రయాణం ఉంటుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. బుద్ధి కుశలతకు ప్రశంసలు లభిస్తాయి.
వృషభం
ఓపికగా వ్యవహరించాలి. మీ ఉన్నతిని ఓర్వలేని వారి ఆటంకాలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులొస్తాయి. ఇంట్లో చికాకులుంటాయి.. ఆస్తి అమ్మే ప్రయత్నం వద్దు. హామీలు నెరవేర్చని కారణంగా నిందలొస్తాయి.
మిథునం
ఉల్లాసంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం ఉంది. అదృష్టం తోడుగా ఉంటుంది. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. సోదరుల లాభాలు తృప్తినిస్తాయి. విందులో పాల్గొంటారు. గౌరవం పెరుగుతుంది.
కర్కాటకం
వ్యవహారాల్లో నష్టం సూచిస్తోంది. కుటుంబానికి దూరంగా వెళ్లాల్సి వస్తుంది. పౌరుషాలకు సమయం కాదు. అవసరమైన చోట్ల నిబంధనలను పాటించడం, హూందాగా వ్యవహరించండి మేలు. ఖర్చులు తగ్గించండి.
సింహం
వ్యవహారాలన్నీ లాభసాటిగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. సంఘంలో కీలక పాత్ర పోషిస్తారు. దూర ప్రాంత వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది. మనశ్శాంతి లభిస్తుంది.
కన్య
అన్ని పనులూ సఫలమవుతాయి. ఉద్యోగ వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. పిత్రార్జిత చిక్కుల పరిష్కారానికి మార్గం కనిపిస్తుంది. అకారణ విరోధంలో మీదే విజయం. మిత్రులతో విందులొ పాల్గొంటారు.
తుల
అనుకున్నట్లుగా పనులు సాగవు. ఆర్థిక లావాదేవీలను వాయిదా వేయడం మంచిది. దూర ప్రయాణం సూచిస్తోంది. ఉన్నత విద్యాప్రయత్నాలు అనుకూలించవు. కడుపు సంబంధ ఇబ్బందులొచ్చే వీలుంది.
వృశ్చికం
పనుల పూర్తికి కష్టపడాల్సి వుంటుంది. ఆశించిన సహకారం లభించదు. డబ్బు సమస్యలుంటాయి. అనూహ్య ఖర్చులూ చికాకు పెడతాయి. తగాదాలకు దూరంగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
ధనుస్సు
పనులు శరవేగంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. బంధువులను కలుస్తారు. బంధాలు బలపడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త విషయాలను గ్రహిస్తారు.
మకరం
కార్యజయం ఉంది. ఆటంకాలను అవలీలగా అధిగమిస్తారు. ధనలాభం ఉంది. బంధువులు సహకరిస్తారు. ఇంటికి కావలసిన అవసరాలను తీరుస్తారు. కొత్త వస్తువులను కొంటారు. పుణ్య కార్యాల్లో పాల్గొంటారు.
కుంభం
అనుకున్న రీతిలో పనులు సాగవు. మీ కష్టానికి తగిన గుర్తింపు లభించదు.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. సంతాన వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. వృథాఖర్చులుంటాయి. వాత సంబంధ సమస్యలుంటాయి.
మీనం
ప్రతి పనిలో అడ్డంకులు వస్తాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. బంధువులతో విరోధం గోచరిస్తోంది. మనసు నిలకడగా ఉండదు. ఆస్తి అమ్మే ప్రయత్నాలు వాయిదా వేయండి. వృథా ఖర్చులు తగ్గించండి.