Today Horoscope in Telugu (08/12/2025): నేటి రాశి ఫలాలు – 12 రాశుల జాతక ఫలితాలు

Today Horoscope in Telugu: డిసెంబర్ 8, 2025 నాటి 12 రాశుల జాతక ఫలాలు. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం, శుభసూచనలు – ప్రతి రాశి ఫలితం ఇక్కడ.

Update: 2025-12-08 05:05 GMT

డిసెంబర్ 08, 2025 నాటి రోజువారీ రాశిఫలాలు ఇక్కడ చదవండి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబ వాతావరణం – ప్రతి రాశికి సంబంధించిన ముఖ్య సూచనలు తెలుసుకోండి.

మేషం (Aries Horoscope Today)

మధ్యమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనవసర ఒత్తిడిని దూరం పెట్టండి. ఆత్మీయుల సహకారం మేలు చేస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. వెంకటేశ్వర స్వామి దర్శనం శక్తినిస్తుంది.

వృషభం (Taurus Horoscope Today)

మనోధైర్యంతో ముందుకు సాగి పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. తోటివారి సహకారం లభిస్తుంది. అక్కర్లేని విషయాలకు దూరంగా ఉండండి. శివుడు ఆరాధన శుభప్రదం.

మిథునం (Gemini Horoscope Today)

ఉద్యోగ ఫలితాలు అనుకూలిస్తాయి. శుభవార్త వింటారు. అవసరమైన డబ్బు సమయానికి లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer Horoscope Today)

ముఖ్య వ్యవహారాల్లో ధైర్యం అవసరం. ప్రారంభించిన పనుల్లోని అడ్డంకులను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. దుర్గా స్తోత్రం పఠనం మంచిది.

సింహం (Leo Horoscope Today)

వ్యాపారంలో దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు. కీలక అంశాల్లో పెద్దల సలహా తీసుకోవడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. ఇష్టదేవత ఆరాధన శుభాన్ని అందిస్తుంది.

కన్య (Virgo Horoscope Today)

అన్ని రంగాల్లో అనుకూల ఫలితాలు. ముఖ్య పనులు ప్రారంభించడానికి మంచి సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని ఇస్తాయి. లక్ష్మీ దేవి దర్శనం శుభఫలితాలను అందిస్తుంది.

తుల (Libra Horoscope Today)

అనుకూలమైన కాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం సహకరిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈశ్వర దర్శనం ఉత్తమం.

వృశ్చికం (Scorpio Horoscope Today)

మిశ్రమ ఫలితాలు. కొన్ని పరిస్థితులు ఇబ్బంది కలిగించవచ్చు. చంచలబుద్ధితో నిర్ణయాలు తీసుకోకండి. నవగ్రహ శ్లోకాలు చదవడం మంచిది.

ధనుస్సు (Sagittarius Horoscope Today)

పనులను ఉత్సాహంగా చేపడతారు. అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. మనోధైర్యంతో చేసే పనులు కీర్తి తెస్తాయి. ఇష్టదేవతా స్తోత్రం పఠనం శుభప్రదం.

మకరం (Capricorn Horoscope Today)

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. సమయోచిత నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆర్థికంగా మంచి కాలం. ఇష్టదేవత దర్శనం ఉత్తమం.

కుంభం (Aquarius Horoscope Today)

అన్ని రంగాల్లో శుభ ఫలితాలు. ఆనందప్రదమైన రోజు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

మీనం (Pisces Horoscope Today)

అనవసర శ్రమకు దూరంగా ఉండండి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. సహనం కోల్పోకండి—అన్నీ క్రమంగా సర్దుకుంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

Tags:    

Similar News