Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (25/11/2024)
Telugu Horoscope Today, November 25, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.
Telugu Horoscope Today
Telugu Horoscope Today, November 25, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు, కృష్ణ పక్షం.
తిధి: దశమి అర్ధరాత్రి దాటాక గం.1.01 ని.ల వరకు ఆ తర్వాత ఏకాదశి.
నక్షత్రం: ఉత్తర అర్ధరాత్రి దాటాక గం.1.24 ని.ల వరకు ఆ తర్వాత హస్త.
అమృతఘడియలు: సాయంత్రం గం.5.16 ని.ల నుంచి గం.7.04 ని.ల వరకు.
వర్జ్యం: లేదు.
దుర్ముహూర్తం: మధ్యాహ్నం గం.12.26 ని.ల నుంచి గం.1.11 ని.ల వరకు.
రాహుకాలం: ఉదయం గం.7.51 ని.ల నుంచి గం.9.15 ని.ల వరకు.
సూర్యోదయం: తె.వా. గం. 6.27 ని.లకు.
సూర్యాస్తమయం: సా. గం.5.40 ని.లకు.
మేషం
అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. అపార్థాలు తొలగిపోతాయి. కోర్టు వివాదాలు అనుకూలిస్తాయి. బలహీనతలను అధిగమిస్తారు. పోయిన వస్తువు దొరుకుతుంది. స్వస్థానప్రాప్తి ఉంది.
వృషభం
ప్రయత్నాలు అంతగా ఫలించవు. మనసు వేదనకు గురవుతుంది. అనవసర వివాదాలకు ఆస్కారముంది. మితిమీరిన జోక్యం మానుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ప్రేమ వ్యవహారాలు ఫలించవు. బద్ధకం వద్దు.
మిథునం
పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. డబ్బు సంబంధ విషయాల్లో జాగ్రత్త అవసరం. స్థిరాస్తి వ్యవహారాలను వాయిదా వేయండి. అవమానాలు ఎదురవుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. తల్లి ఆరోగ్యం జాగ్రత్త.
కర్కాటకం
పనులు సవ్యంగా సాగుతాయి. ధనాదాయం పెరుగుతుంది ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. విందుకు హాజరవుతారు. ముఖ్యమైన వార్త అందుతుంది. మనశ్శాంతి లభిస్తుంది.
సింహం
అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్త. ఆస్తినష్టం ఉంది. కుటుంబ పరిస్థితులు వేదనను కలిగిస్తాయి. వేళకు భోజనముండదు. నిందలొస్తాయి. నోటిదురుసును తగ్గించుకోవాలి.
కన్య
రోజంతా ఉల్లాసంగా సాగుతుంది. ఆకాంక్ష నెరవేరుతుంది. గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభం చేకూరుతుంది. ఉన్నతస్థాయికి ఎదిగే ప్రయత్నం అనుకూలిస్తుంది. సమాజం గురించి ఆలోచిస్తారు.
తుల
పనులు సవ్యంగా సాగవు. అడ్డంకులు సృష్టించే వారు ఎక్కువవుతారు. ఇతరుల వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. వృథాఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణం ఉంది.
వృశ్చికం
కాలం ఆనందదాయకంగా సాగుతుంది. చేపట్టిన ప్రతి కార్యమూ సఫలం అవుతుంది. ఆకాంక్ష నెరవేరుతుంది. సంతాన సంబంధ శుభకార్యాచరణ గురించి ఆలోచిస్తారు. విందుల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బావుంటుంది.
ధనుస్సు
అన్నింటా అనుకూల ఫలితాలుంటాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. వృత్తి సంబంధ వ్యవహారాలు శుభప్రదంగా సాగుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబ విషయాలు తృప్తికరంగా ఉంటాయి.
మకరం
కార్యసాధనలో ఆటంకాలను దాటాల్సి వుంటుంది. దూర ప్రయాణం గోచరిస్తోంది. త్వరగా అలసిపోతారు. ఖర్చులు పెరుగుతాయి. సంతానంతో సఖ్యత ఉండదు. న్యాయవివాదాల్లో జాగ్రత్త. పెద్దలను కలుస్తారు.
కుంభం
ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. అధికారుల కోపానికి గురయ్యే సూచన ఉంది. బలహీనతను జయించాలి. ఉద్రేకాన్ని అణచుకోవాలి. పోటీలకు దిగకండి. శత్రుపీడ పెరుగుతుంది. ఆరోగ్యం గురించిన శ్రద్ధ అవసరం.
మీనం
అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి. ధన సంబంధ లావాదేవీలు తృప్తినిస్తాయి. బంధువులను కలుస్తారు. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణం లాభిస్తుంది. జీవిత భాగస్వామి సూచన పాటించండి.