Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (22/11/2024)
Telugu Horoscope Today, November 22, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.
Telugu Horoscope Today, November 22, 2024
Telugu Horoscope Today, November 22, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు, కృష్ణ పక్షం.
తిధి: సప్తమి సాయంత్రం గం.6.07 ని.ల వరకు ఆ తర్వాత అష్టమి.
నక్షత్రం: ఆశ్లేష సాయంత్రం గం.5.10 ని.ల వరకు ఆ తర్వాత మఖ.
అమృతఘడియలు: మధ్యాహ్నం గం.3.27 ని.ల నుంచి గం.5.10 ని.ల వరకు.
వర్జ్యం: రేపు తెవా. గం.6.18 ని.ల నుంచి గం.8.04 ని.ల వరకు.
దుర్ముహూర్తం: ఉదయం గం.8.40 ని.ల నుంచి గం.9.25 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.25 ని.ల నుంచి గం. 1.10 ని.ల వరకు.
రాహుకాలం: ఉదయం గం.10.38 ని.ల నుంచి గం.12.02 ని.ల వరకు.
సూర్యోదయం: తె.వా. గం. 6.25 ని.లకు.
సూర్యాస్తమయం: సా. గం. 5.40 ని.లకు.
మేషం
పనులు ఆశించిన రీతిలో సాగవు. ధన సంబంధ లావాదేవీల్లోనూ నష్టం గోచరిస్తోంది. విచారం పెరుగుతుంది. ఆలోచనతీరులో మార్పు వస్తుంది. రహస్య వ్యవహారాల్లో పాల్గొంటారు. వాహన సంబంధ సమస్యలుంటాయి.
వృషభం
వ్యవహారాలన్నీ శుభప్రదంగా సాగుతాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తినిస్తాయి. ఆత్మీయులను కలుస్తారు. ఆర్థికచిక్కులను పరిష్కరిస్తారు. దాయాదుల వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విశ్వాసం పెరుగుతుంది.
మిథునం
మాట పలుకుబడి తగ్గుతుంది. ఆచితూచి వ్యవహరించండి. బ్యాంకు లావాదేవీలు చికాకు పెడతాయి. కుటుంబ సభ్యుల తీరు బాధిస్తుంది. వేళకు భోజనముండదు. తగాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త.
కర్కాటకం
ప్రయత్నాలు సఫలం అవుతాయి. చక్కటి వ్యక్తిత్వంతో పెద్దవారిని ఆకర్షిస్తారు. కీర్తి పెరుగుతుంది. ఉన్నతస్థితి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాహనయోగం ఉంది. కీలక సమయంలో అదృష్టం తోడుంటుంది.
సింహం
పనుల్లో ఆశించిన ప్రయోజనాలు లభించవు. శ్రమకు తగ్గ ఆర్థిక లబ్ది ఉండదు. మిత్రులతోనూ విరోధం గోచరిస్తోంది. వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు విషయాల్లో అప్రమత్తత అవసరం. అవమానం ఉంది.
కన్య
పట్టింది బంగారంలాగా సాగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలపై ప్రత్యేక శ్రద్ధను పెడతారు. ఇతరుల సహకారం లభిస్తుంది. ఆత్మీయుల కలయిక ఉల్లాసాన్నిస్తుంది. బంధాలు బలపడతాయి.
తుల
ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. అభీష్టం నెరవేరుతుంది. ఇతరులతో ఏర్పడే విరోధంలో మీదే పైచేయిగా ఉంటుంది. పెద్దల ఆశీస్సులను పొందుతారు. గౌరవం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.
వృశ్చికం
పనుల పూర్తికి ఆటంకాలు ఎదురవుతాయి. అశాంతి పెరుగుతుంది. భవిష్యత్తుకు సంబంధించిన చింత ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృథా ఖర్చులుంటాయి. సంతానం తీరు వేధిస్తుంది.
ధనుస్సు
చేపట్టిన ఏ పనీ సజావుగా సాగదు. ఆలోచనలు వక్రమార్గాన సాగుతాయి. చెడుదారులు తొక్కే అవకాశం ఉంది. మనసును నిగ్రహించుకోవాలి. పోటీల్లో పరాజయం తప్పదు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మకరం
వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. బంధువులను కలుస్తారు. నిజాయితీకి గుర్తింపుంటుంది.
కుంభం
అన్ని పనులూ విజయవంతంగా సాగుతాయి. ధన సంబంధ చిక్కులు తొలగిపోతాయి. కొత్త వస్తువులను కొంటారు. బంధువుల సహకారం లభిస్తుంది. వివాదం పరిష్కారమవుతుంది. అదృష్టం తోడుగా ఉంటుంది.
మీనం
ఆటంకాలను అధిగమిస్తేనే పనులు పూర్తవుతాయి. అభీష్టం నెరవేరే సూచన లేదు. తెలివితేటలకు తగ్గ గుర్తింపు లభించదు. ఆలోచనలను నిగ్రహించుకోవాలి. వృథా ఖర్చు పెరుగుతుంది. వాత సంబంధ ఇబ్బంది వస్తుంది.