Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (16/11/2024)
Telugu Horoscope Today, November 16, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.
Telugu Horoscope Today, 16 November 2024
Telugu Horoscope Today, November 16, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు, కృష్ణ పక్షం.
తిధి: పాడ్యమి రాత్రి గం.11.50 ని.ల వరకు ఆ తర్వాత విదియ.
నక్షత్రం: కృత్తిక రాత్రి గం.7.28 ని.ల వరకు ఆ తర్వాత రోహిణి.
అమృతఘడియలు: సాయంత్రం గం.5.19 ని.ల నుంచి గం.6.45 ని.ల వరకు.
వర్జ్యం: ఉదయం గం.8.41 ని.ల నుంచి గం.10.08 ని.ల వరకు.
దుర్ముహూర్తం: ఉదయం గం.6.22 ని.ల నుంచి గం.7.52 ని.ల వరకు.
రాహుకాలం: ఉదయం గం.9.11 ని.ల నుంచి గం. 10.36 ని.ల వరకు.
సూర్యోదయం: తె.వా. గం. 6.22 ని.లకు.
సూర్యాస్తమయం: సా. గం. 5.40 ని.లకు.
మేషం
ఇతరుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిజాయతీకి తగ్గ గుర్తింపు లభించదు. నిందలూ భరించాల్సి వస్తుంది. మానసిక ప్రశాంతత ఉండదు. అనవసర జోక్యాలు వద్దు. కుటుంబ వ్యవహారాలపై దృష్టి పెట్టండి.
వృషభం
అన్ని పనులూ సవ్యంగా సాగుతాయి. డబ్బుకి సంబంధించిన విషయాలు తృప్తినిస్తాయి. వాహన యోగం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. గౌరవం లభిస్తుంది. మనశ్శాంతిని పొందుతారు.
మిథునం
ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. అనవసర తగాదాలు వస్తాయి. పనులు ఆశించిన రీతిలో సాగవు. ఆత్మీయుల వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. వేళకు భోజనముండదు. ఇంటికి దూరంగా వెళతారు.
కర్కాటకం
ఇంటి వ్యవహారాలు తృప్తినిస్తాయి. సంతాన సంబంధ శుభకార్యాల గురించి చర్చిస్తారు. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. మిత్రులతో విందుకు వెళతారు. ఆరోగ్యం బావుంటుంది.కొత్త స్నేహాలు ఏర్పడతాయి.
సింహం
అన్ని పనులూ సవ్యంగా సాగుతాయి. డబ్బుకి ఇబ్బంది ఉండదు. శత్రువులపై విజయం సాధిస్తారు. చక్కటి అవకాశాలు అందివస్తాయి. మీలోని నైపుణ్యానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు.
కన్య
కార్యసాధనలో విపరీతంగా శ్రమించాల్సి వుంటుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. సంతానం తీరు చికాకు పరుస్తుంది. ఆత్మీయులతో గొడవలు వస్తాయి. గురుతుల్యులను కలుస్తారు. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది.
తుల
మీ బలహీనతలే కార్యసాధనలో అడ్డంకిగా మారతాయి. దురభిప్రాయాలు ఏర్పడతాయి. చెడుదారిలో వెళ్లడం వల్ల నష్టపోతారు. ఉద్యోగులకు చివాట్లు తప్పవు. తగాదాలకూ ఆస్కారముంది. అజీర్తి సమస్య వేధిస్తుంది.
వృశ్చికం
అన్నింటా శుభ ఫలితాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి సూచనలతో కుటుంబ వ్యవహారాలను పరిష్కరిస్తారు. మనశ్శాంతి లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రయాణం లాభిస్తుంది. విందులో పాల్గొంటారు.
ధనుస్సు
వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. ధనలాభం ఉంది. ఎన్నో సందేహాలు పరిష్కారమవుతాయి. అపార్థాలు తొలగిపోతాయి. మనశ్శాంతి లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అదృష్టంవరిస్తుంది. కీర్తి పెరుగుతుంది.
మకరం
పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. బద్ధకాన్ని వదిలి కష్టపడాలి. సంతానం తీరు చికాకు పరుస్తుంది. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు ఉండదు. నిరాశను దూరం చేయాలి. ప్రేమ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి.
కుంభం
బుద్ధి నిలకడగా ఉండదు. పనులు చెడిపోయే సూచన ఉంది. బంధువులతో సఖ్యత చెడుతుంది. కుటుంబ సభ్యల తీరు ఆవేదనను కలిగిస్తుంది. స్థిరాస్తి లావాదేవీలు వాయిదా వేయండి. వృథా ఖర్చులను తగ్గించాలి.
మీనం
చేపట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా సాగుతాయి. నాయకత్వ పటిమకు గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. ఇరుగు పొరుగుతో సఖ్యత పెరుగుతుంది.