Solar Eclipse 2025: సూర్యగ్రహణం ఎఫెక్ట్.. శనిదేవుడి రాశి మార్పు, 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది?
Solar Eclipse 2025 Effect On Each Zodiac Sign: మార్చి 29న ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే, ద్వాదశ రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి నియమాలు పాటించాలి? జ్యోతిషులు ఏం చెబుతున్నారు తెలుసుకుందాం.
Solar Eclipse 2025: సూర్యగ్రహణం ఎఫెక్ట్.. శనిదేవుడి రాశి మార్పు, 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది?
Solar Eclipse 2025 Effect On Each Zodiac Sign
సూర్య, చంద్ర గ్రహణాలు తప్పకుండా ప్రతి రాశిపై ప్రభావం ఉంటుంది. ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం మార్చి 29న ఏర్పడబోతుంది. ఇది కాకుండా శని కూడా కుంభం నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ నేపథ్యంలో 12 రాశులపై ఆ ప్రభావం ఎలా ఉంటుంది? తెలుసుకుందాం.
మేష రాశి..
ఈ సూర్యగ్రహణం ప్రభావం వల్ల మీకు బాధ్యతలు పెరుగుతాయి. అంతేకాదు మీలో ఏకాగ్రత కూడా పెరుగుతుంది. శని వల్ల మీ కెరీర్‌లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. మీ వ్యక్తిగత లక్ష్యాలు కూడా మారతాయి.
వృషభం..
సూర్య గ్రహణం, శని రాశిమార్పు వల్ల మీలో ఆధ్యాత్మికత పెరుగుతుంది. మీరు దూరం ప్రాంతాలకు ప్రయాణం చేసే అవకాశం ఉంది. అంతేకాదు శని వల్ల మీ వ్యక్తిగత జీవితంలో అనుకోని మార్పులు సంభవిస్తాయి.
మిథున రాశి..
మిథున రాశివారు ఈ సూర్యగ్రహణం, శని వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు. మీకు మంచి అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో కూడా లాభాలు పొందే అవకాశం ఉంది.
కర్కాటక రాశి..
వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ భాగస్వామ్యంలో అనుకోని మార్పులు రావచ్చు. శని ఎఫెక్ట్ వల్ల మీరు చాలా ఆలోచించి అడుగువెయాల్సి ఉంటుంది.
సింహ రాశి..
సింహ రాశి వారు సూర్యగ్రహణం నుంచి ఆరోగ్యంపై జాగ్రత్త తీసుకోవాలి. మీ ప్రతి పనిలో కాస్త ఏకాగ్రత పెంచాల్సి ఉంటుంది. అంతేకాదు కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు మీ లైఫ్‌స్టైల్‌లో కూడా భారీ మార్పులు వస్తాయి.
కన్యా..
ఈ రాశివారిలో సృజనాత్మకత పెరుగుతుంది. భాగస్వామితో మరింత ప్రేమ పెరుగుతుంది. అంతేకాదు ఎన్నో రోజులుగా కంటున్న కలలు ఇప్పుడు సాకారం అయ్యే అవకాశం ఉంటుంది.
తులా..
ఈ రాశివారికి ఇంట్లో భారీ మార్పులు చోటుచేసుకుంటాయి. అంతేకాదు శని వల్ల వీరు కుటుంబంతో మరికాస్త అనుబందం పెంచుకునే అవకాశం ఉంటుంది.
వృశ్చిక రాశి..
ఈ రాశివారి లైఫ్‌లో కూడా భారీ మార్పులు జరుగుతాయి. ప్రధానంగా మాట ఆచితూచి మాట్లాడాలి. కొత్త విషయాలు నేర్చుకుంటారు.
ధనస్సు రాశి..
ఈ రాశివారికి ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యాపారంలో కూడా లాభాలు గడిస్తారు. అయితే, శని రాశి మార్పు మీకు ఓ గుణపాఠం నేర్పుతుంది. ప్రధానంగా డబ్బులు, వ్యక్తిగత విలువలు కూడా మారతాయి.
మకర రాశి..
మకర రాశి వారికి శని రాశి మార్పు, సూర్యగ్రహణంలో జీవితంలో అనుకోని మార్పులు జరుగుతాయి. మీరు గుర్తింపు పొందే అవకాశం ఉంది. అయితే, శని వల్ల మీ ప్రొఫెషన్ లైఫ్‌లో బాధ్యతలు కూడా పెరుగుతాయి.
కుంభ రాశి..
ఆధ్యాత్మికత పెరగుతుంది. ఏకాగ్రత కూడా పెంచుకుంటారు. నిజానిజాలు తెలుసుకునే సమయం.
మీనరాశి..
మీ భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. సూర్యగ్రహణం వల్ల మీ వ్యక్తిగత లక్ష్యాలు మారే అవకాశం ఉంది. శని వల్ల మీ జీవిత పరమార్థాన్ని కూడా తెలుసుకుంటారు.