Vastu Tips: ఇంట్లో వాస్తు దోషం ఉందో లేదో ఇలా తెలుసుకోండి..!
Vastu Tips: ఇల్లు లేదా ఆఫీసు నిర్మించేటప్పుడు వాస్తు శాస్త్ర నియమాలను పాటించడం చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం ఇంటి గదులు, హాలు, వంటగది, ఆలయం, బాత్రూమ్, బెడ్ రూమ్ లకు ఒక నిర్దిష్ట దిశ ఉండాలి.
Vastu Tips: ఇంట్లో వాస్తు దోషం ఉందో లేదో ఇలా తెలుసుకోండి..!
Vastu Tips: ఇల్లు లేదా ఆఫీసు నిర్మించేటప్పుడు వాస్తు శాస్త్ర నియమాలను పాటించడం చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం ఇంటి గదులు, హాలు, వంటగది, ఆలయం, బాత్రూమ్, బెడ్ రూమ్ లకు ఒక నిర్దిష్ట దిశ ఉండాలి. అన్ని గదులను వాటి దిశ ప్రకారం నిర్మించినట్లయితే ఇంట్లో వాస్తు దోషం ఉండదు. ఆ ఇంటి కుటుంబ సభ్యులు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఒకవేళ మీరు సమస్యలను ఎదుర్కొంటుంటే మీ ఇంట్లో ఏదైనా వాస్తు లోపం ఉండొచ్చు. అయితే, ఇంట్లో వాస్తు దోషం ఉందో లేదో ఇలా తెలుసుకోండి..
ఇంట్లో వాస్తు దోషం ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి?
* ఇంట్లో ఉన్నవారు పదే పదే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా
లేదా ఇంట్లో డబ్బు నిలవకపోయినా లేదా అప్పుడప్పుడు ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నా మీ ఇంట్లో వాస్తు దోషం ఉండవచ్చని అర్థం.
* ఇంట్లో తరచుగా అనారోగ్యానికి గురవుతుంటే, కుటుంబ సభ్యులలో ఒకరి తర్వాత ఒకరికి వ్యాధులు వస్తుంటే ఆ ఇంట్లో వాస్తు దోష లక్షణాలు ఉండవచ్చు.
* వాస్తు లోపం ఉన్న ఇంట్లో ప్రజలు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. దీనివల్ల వ్యక్తులు తమ సమతుల్యతను కోల్పోతారు. తరచుగా అవసరానికి మించి కోపంగా ఉంటారు లేదా నిద్రపోలేరు. దీనివల్ల మైగ్రేన్ వంటి సమస్యలు వస్తాయి.
* ఇంట్లో వాస్తు దోషం ఉన్న వ్యక్తులు కష్టపడి పనిచేసినప్పటికీ పనుల్లో విజయం సాధించలేరు.
* ఇంటి ప్రధాన ద్వారం సరైన దిశలో లేకపోవడం వల్ల మీరు చాలాసార్లు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
వాస్తు దోషానికి నివారణలు
* వాస్తు దోషాలకు పరిహారంగా వాస్తు శాంతిని పఠించండి.
* మంత్రాలు జపించడం వల్ల ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది.