Shasta Graha Kutami: మీనరాశిలో షష్టగ్రహ కూటమి.. ఈ 3 రాశులకు రక్త కన్నీరే..!
Shasta Graha Kutami Unlucky Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి 28, 29, 30వ తేదీల్లో షష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది. దీనివల్ల ఓ 3 రాశులకు వారికి తీవ్రవైన ఇబ్బందులు తప్పవట. ఇందులో మీ రాశి కూడా ఉందా ఓసారి చెక్ చేయండి.
Shasta Graha Kutami: మీనరాశిలో షష్టగ్రహ కూటమి.. ఈ 3 రాశులకు రక్త కన్నీరే..!
Shasta Graha Kutami Unlucky Zodiac Signs: షష్టగ్రహ కూటమి ఏర్పడితే జీవితంలో ఇబ్బందులు తప్పవు. ఈ మార్చి చివరి వారం అయిన 28, 29 30వ తేదీలలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. దీనివల్ల సింహ, కుంభ, మీన రాశులకు జీవితంలో అనుకోని విపత్తులు తప్పవట. రెండు నెలలపాటు అత్యంత జాగ్రత్తలు వహించాలి.
సింహ రాశి..
సింహ రాశివారికి ఎక్కువ ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకంటే వీరికి అష్టమ స్థానంలో షష్ట గ్రమ కూటమి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ కూటమి వల్ల వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సింహ రాశివారు దూర ప్రయాణాలు చేయకపోవడమే మేలు. అంతేకాదు వీరికి ఆర్థిక ఇబ్బందులు హఠాత్తుగా ఎదురవుతాయట. అంతేకాదు షష్టగ్రహ కూటమి వల్ల జీవితంలో అనుకోని ఇబ్బందులు వచ్చిపడతాయట. ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తాయి. ఈ నేపథ్యంలో ఈరోజుల్లో సింహ రాశి అతిజాగ్రత్తలు పాటించాలి.
కుంభ రాశి..
షష్ట గ్రహ కూటమి కుంభ రాశివారికి రెండో ఇంట్లో ఏర్పడుతుంది. వీరికి కూడా గడ్డుకాలం అని చెబుతున్నారు. ఈ రాశివారికి కుటుంబ పరమైన సమస్యలు వస్తాయి. ఆర్థిక సమస్యలు ఉంటాయి. వ్యాపారంలో నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఈ సమయంలో ఎవరికీ మాట ఇవ్వకూడదు. డబ్బు విషయంలో అతి జాగ్రత్త ముఖ్యం. అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఎదురవుతాయి. ప్రధానంగా ఈ సమయంలో కొత్త పనులు ఏవీ ప్రారంభించకపోవడమే మేలు.
మీన రాశి..
ఈ రాశి అతిగా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే మీన రాశిలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇతర రాశుల కంటే ఈ రాశికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారాలు అచితూచి చేయాలి. కుటుంబంలో సఖ్యత పెంచుకోవాలి. ఎవరికీ మాట ఇవ్వకూడదు. దూర ప్రయాణాలు చేసినప్పుడు అతి జాగ్రత్తలు తప్పనిసరి.
ఈ మూడు రాశులు రెండు నెలలపాటు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు దూర ప్రయాణాలు చేయకూడదు. కొత్త వ్యాపారాలకు దూరంగా ఉండటమే మేలు. ఇష్టదైవాన్ని పూజించండి. ప్రభావం కాస్త తగ్గుముఖం పడుతుంది.