Astro News: హోలీకి ముందు శనిగ్రహం వల్ల ఈ 3 రాశులవారికి ఇబ్బందులు.. అవేంటంటే..?
Astro News: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం కొంత కాలానికి దాని గమనాన్ని మార్చుకుంటుంది. దీనివల్ల 12 రాశులలో మార్పులు సంభవిస్తాయి.
Astro News: హోలీకి ముందు శనిగ్రహం వల్ల ఈ 3 రాశులవారికి ఇబ్బందులు.. అవేంటంటే..?
Astro News: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం కొంత కాలానికి దాని గమనాన్ని మార్చుకుంటుంది. దీనివల్ల 12 రాశులలో మార్పులు సంభవిస్తాయి. గ్రహాలన్నింటిలో శనిగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. దీనిని కర్మగ్రహంగా పిలుస్తారు. ఒక వ్యక్తి చేస్తున్న పనులను బట్టి వారికి కర్మ ఫలితాలను అందిస్తాడు. శని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం శనిగ్రహం కుంభరాశిలో ఉంది. 2025లో కుంభరాశిని వదిలి మీనరాశిలోకి ప్రవేశిస్తుంది. హోలీకి ముందు శనిగ్రహం వల్ల కొన్ని రాశులపై బ్యాడ్ ఎఫెక్ట్ ఉండనుంది. ఆ రాశుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి నాలుగో ఇంట్లో శని ఉండడం వల్ల ఈ రాశికి చెందిన వ్యక్తుల తల్లిదండ్రుల ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబంలో విభేదాలు తలెత్తవచ్చు. మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. వృత్తి జీవితంలో ఎక్కువ శ్రద్ధ అవసరం. మీ కష్టానికి తగిన ఫలాన్ని మరొకరు పొందవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రమతో పాటు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
కర్కాటక రాశి
ఈ రాశి ఎనిమిదో ఇంట్లో శని ఉండబోతున్నాడు. దీనివల్ల ఈ రాశి వ్యక్తులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కొంచెం నిర్లక్ష్యం చేసినా తీవ్రమైన వ్యాధికి గురవుతారు. వ్యాపారంలో నష్టం రావచ్చు జాగ్రత్తగా ఉండటం మంచిది. లాభం సాధించడానికి షార్ట్ కట్‌లను అస్సలు పాటించవద్దు. తల్లి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
మీనరాశి
ఈ రాశి బయటి ఇంట్లో శని ఉదయించబోతున్నాడు. ఈ పరిస్థితిలో ఈ రాశి వారికి పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. చిన్న చిన్న వ్యాధులను నిర్లక్ష్యం చేయవద్దు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బలహీనంగా మారుతుంది. ఇంటి పెద్దల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.