Shani Dev: పూర్వాభద్ర నక్షత్రంలో శని బుధుల సంయోగం.. ఈ 3 రాశులకు అదృష్టం.. సొంత ఇల్లు కొనే సమయం

Shani Budha Yuti Lucky Signs: పూర్వాభద్ర నక్షత్రంలోకి శని బుధులె కలవనున్నారు. ఈనేపథ్యంలో ఈరోజు నుంచి 3 రాశులకు అదృష్టం కలిసి వస్తుంది. ఇందు లో మీ రాశి ఉందా?

Update: 2025-04-04 00:30 GMT

Shani Dev: పూర్వాభద్ర నక్షత్రంలో శని బుధుల సంయోగం.. ఈ 3 రాశులకు అదృష్టం.. సొంత ఇల్లు కొనే సమయం

Shani Budha Yuti Lucky Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు రాశులు, నక్షత్రాల మార్పుల వల్ల ప్రతి రాశిపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. అయితే శని దేవుడు ఇప్పటికే పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నాడు. ఆ నక్షత్రంలోకి నేడు బుధుడు ప్రవేశించనున్నాడు దీంతో శని బుధ గ్రహాల కలయిక ఏర్పడుతుంది. మూడు రాశుల వాసి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. దీంతో వాళ్లు విశేష యోగం పొందుతారు. అవేంటో తెలుసుకుందాం

మిథున రాశి..

మిథున రాశివారికి పూర్వభద్ర నక్షత్రంలో శని బుధుల కలయిక వల్ల అశేష యోగం కలుగుతుంది. ఏప్రిల్‌ 3 న ఈ యోగం ఏర్పడుతుంది. ప్రధానంగా ఉద్యోగం వెతుకుతున్న వారికి శుభ సమయం. వీళ్లు శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగాలు అందిపుచ్చుకుంటారు. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సజావుగా పూర్తవుతాయి. అంతేకాదు కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సమయం. ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. మిథున రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఈ నేపథ్యంలో స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది .

వృషభ రాశి..

శని బుధుల కలయిక వల్ల వృషభ రాశికి విశేష యోగాలు కలుగుతాయి. ప్రధానంగా కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలలో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారంలో భారీ లాభాలు అందిపుచ్చుకుంటారు. వీళ్లలో కొత్తగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాదు కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి ఇది శుభ సమయం. పెండింగ్‌లో ఎన్నో రోజులుగా నిలిచిపోయిన మీ డబ్బులు మీ చేతికి వస్తాయి. భాగస్వామితో జీవితం హాయిగా సాగుతుంది.

తులారాశి..

పూర్వాభద్ర నక్షత్రంలో శని బుధుల కలయిక వల్ల తులా రాశి వారికి ప్రతి కోరిక నెరవేరుతుంది. వీళ్లు పట్టిందల్లా బంగారం అవుతుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు అందిపుచ్చుకుంటారు. అంతేకాదు పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అయ్యేవాళ్ళకి ఇది శుభ సమయం. జీతం పెరగడం ఖాయం ప్రమోషన్ వస్తుంది. అంతేకాదు ఈ సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించిన మంచి లాభాలు అందిపుచ్చుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా మెండుగా ఉంది.

Tags:    

Similar News